Advertisementt

200 రోజుల్లో పుష్పా గాడి రూలింగ్..

Mon 29th Jan 2024 10:53 PM
pushpa the rule  200 రోజుల్లో పుష్పా గాడి రూలింగ్..
Pushpa The Rule begins in 200 Days 200 రోజుల్లో పుష్పా గాడి రూలింగ్..
Advertisement
Ads by CJ

పుష్ప.. పుష్పరాజ్.. నీయవ్వ తగ్గేదేలే.. అని అల్లు అర్జున్ చేసిన మ్యానరిజమ్‌కు ప్రపంచం మొత్తం దాసోహమైంది. పుష్పగాడి  రైజ్‌కే ఇలా ఊగిపోతే.. ఇక రూల్ ఎలా ఉండబోతోందో? అని ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు వేచి చూస్తున్నారు. ప్రస్తుతం పుష్ప పార్ట్ 2.. పుష్ప ది రూల్ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. తాజాగా మేకర్స్ పుష్ప 2కి సంబంధించి ఓ అప్‌డేట్ వదిలారు. పుష్పగాడి రూలింగ్ ఎలా ఉండబోతుందో తెలియడానికి ఇంకా 200 రోజులు మాత్రమే సమయం ఉందని తెలుపుతూ.. ఓ పోస్టర్ వదిలారు. 

ఈ పోస్టర్‌తో పుష్ప మరోసారి టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఇండిపెండెన్స్ డే స్పెషల్‌గా 2024, ఆగస్టు 15న పుష్ప ది రూల్‌ను విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే అధికారికంగా మేకర్స్ ప్రకటించారు. ఆగస్ట్ 15న ఈ సినిమా విడుదల అవుతుందా? అనేలా ఒకవైపు అనుమానాలు వ్యక్తమవుతుంటే.. మరోవైపు మేకర్స్ మాత్రం ఆ రోజున విడుదల పక్కా అనేలా పోస్టర్స్ వదులుతున్నారు. అయితే విడుదల విషయంలో అనుమానాలకు కారణం లేకపోలేదు. ఇందులో అల్లు అర్జున్ పక్కన చేసిన కేశవ పాత్రధారి ఇటీవల అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అతనిపై షూట్ చేసిన సన్నివేశాలు ఇంకా పూర్తి కాలేదనేలా వార్తలు వినవస్తున్న నేపధ్యంలో.. అందరూ ఈ సినిమా రిలీజ్ విషయంలో డౌట్స్ వ్యక్తం చేస్తున్నారు.

ఆ డౌట్స్ సంగతి పక్కన పెడితే.. పుష్ప2లో పుష్పరాజ్‌గాడి రూలింగ్ మాములుగా ఉండదనేలా చిత్రయూనిట్ వర్గాల నుండి టాక్ వినబడుతోంది. పార్ట్ 1తో అల్లు అర్జున్‌కు నేషనల్ అవార్డ్ వచ్చిన విషయం తెలిసిందే. దీనిని దృష్టిలో పెట్టుకుని లెక్కల మాస్టరు సుకుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా పార్ట్ 2ని రూపొందిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం పార్ట్ 3 కూడా ఉండే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇక తాజాగా విడుదల చేసిన పోస్టర్‌లో 200 నెంబర్‌ ఓ కొండపై ఉన్నట్లు చూపిస్తే.. ఆ కొండపైకి ఓ పులి వెళుతున్నట్లుగా ఆసక్తికరంగా పోస్టర్‌ని డిజైన్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతోంది.

Pushpa The Rule begins in 200 Days:

Pushpa The Rule massive release on Independence Day   

Tags:   PUSHPA THE RULE
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ