Advertisementt

జనసేన పార్టీలోకి మరో నిర్మాత

Mon 29th Jan 2024 06:48 PM
kayagurala lakshmipathi janasena  జనసేన పార్టీలోకి మరో నిర్మాత
Producer Kayagurala Lakshmipathi joined in the Janasena Party జనసేన పార్టీలోకి మరో నిర్మాత
Advertisement
Ads by CJ

సినిమా ఇండస్ట్రీ నుండి ఇప్పుడిప్పుడే జనసేన వైపు అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే టాలీవుడ్ టాప్ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ జనసేన కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. అలాగే నటుడు సాగర్, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వంటి వారు కూడా ఇటీవల జనసేన పార్టీలో చేరారు. ఇప్పుడు మరో నిర్మాత జనసేన కండువా కప్పుకున్నారు. కే‌ఎల్‌పి మూవీస్ సంస్థ అధినేత, IQ మూవీ నిర్మాత మరియు బిజినెస్‌మ్యాన్ అయినటువంటి కాయగూరల లక్ష్మీపతి సోమవారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు.

కాయగూరల లక్ష్మీపతి తండ్రి కీ.శే. కె. నారాయణస్వామి టిడిపి పార్టీ ఆవిర్భావం నుండి పార్టీ మనుగడకై, ప్రజాసేవకై కృషి చేసిన వ్యక్తిగా పేరు పొందారు. తన తండ్రి స్ఫూర్తితోనే తను కూడా ప్రజాసేవ చేయడానికి నేడు జనసేన పార్టీలో చేరినట్లుగా నిర్మాత కాయగూరల లక్ష్మీపతి తెలిపారు. గతంలో ఆయన ఆర్టిఏ బోర్డు మెంబర్‌గా, టెలికాం అడ్వైజరీ కమిటీ మెంబర్‌గా అనంతపురం పట్టణ ప్రజల ఉన్నతికి పని చేశారు. ఇంకా ఆయన అనంతపురంలో పలు సేవాకార్యక్రమాలను నిర్వహించి ఉన్నారు. ఆయన సేవను గుర్తించి.. జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి అనంతపురం అర్బన్ నియోజకవర్గం పార్టీ గెలుపు కోసం, ప్రజాసేవ కోసం కృషి చేయాలని సూచించినట్లుగా నిర్మాత చెప్పుకొచ్చారు.

ఇంకా కాయగూరల లక్ష్మీపతి మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ గారిపై ఉన్న అభిమానంతో గతంలో పలు సేవా కార్యక్రమాల్లో ఆయనతో పాల్గొనడం జరిగింది. సినిమా అంటే ఇష్టంతో IQ అనే సినిమాతో నిర్మాతగానూ మారాను. ప్రస్తుతం రెండు సినిమాలు నిర్మాణ దశలో ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీ నుండి నాకు చాలా మంచి సపోర్ట్ లభించింది.. లభిస్తోంది. అదేవిధంగా బిజినెస్ రంగంలో నాకు సపోర్ట్ చేస్తున్న నా తోటి మిత్రులకు కృతజ్ఞతలు. సినిమాలు నిర్మిస్తూనే పవన్ కళ్యాణ్‌గారి అడుగుజాడల్లో జనసేన పార్టీలో జిల్లాలో ఎక్కడ పొత్తు మీద స్థానం ఇచ్చినా నా వంతు కృషి చేస్తూ పార్టీ కోసం ప్రజల కోసం పనిచేస్తాను. పవన్ కళ్యాణ్‌గారు నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా జనసేన పార్టీ నుంచి ప్రజలకు ఎంత సేవ చేయాలో అంత చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు.

Producer Kayagurala Lakshmipathi joined in the Janasena Party :

After BVSN Prasad.. One More Producer Joined Janasena Party

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ