Advertisementt

వర్మా.. నీ ఏడుపే ఆయనకు ఉన్నతి!

Sun 28th Jan 2024 11:19 PM
ram gopal varma  వర్మా.. నీ ఏడుపే ఆయనకు ఉన్నతి!
RGV Insults Padma Winners వర్మా.. నీ ఏడుపే ఆయనకు ఉన్నతి!
Advertisement
Ads by CJ

ఒకవైపు వ్యూహం విషయంలో అంతా బెడిసికొడుతోంది.. మరో వైపు తను శత్రువుగా భావించే చిరంజీవి, పవన్ కళ్యాణ్ వంటి వారు అత్యున్నత స్థాయికి చేరుకుంటున్నారు. దీంతో ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోతున్నట్లుంది వర్మకి. ఏం చేయాలో కూడా తెలియనంతగా.. ఇష్టం వచ్చినట్లు ఏదో ఒక ట్వీట్ వేస్తున్నాడీ వివాదాల దర్శకుడు. వాస్తవానికి వర్మ సరైన మార్గంలో వెళ్లి ఉంటే, శివ చిత్రంతో వచ్చిన క్రియేటివిటీని నిలుపుకుని ఉంటే.. ఇవాళ చిరు పక్కన విభూషణుడై ఉండేవాడు. తన ఉన్నతిని తానే కాలరాసుకోవడం ఒక్క వర్మకే చెల్లింది. అందుకే చిరంజీవి ఉన్నతిని జీర్ణించుకోలేకపోతున్నాడు. ఆయనకు వచ్చిన అవార్డుని ఆకలింపు చేసుకోలేకపోతున్నాడు.

తాజాగా రామ్ గోపాల్ వర్మ ఎక్స్ వేదికగా పద్మ పురస్కారాలపై పెదవి విరిచాడు. మరీ ముఖ్యంగా మెగాస్టార్‌ని ఇన్‌వాల్వ్ చేస్తూ.. ఆయన చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. శ్రీ పద్మ సుబ్రహ్మణ్యం, శ్రీ బిందేశ్వర్ పాథక్ వంటి వాళ్ల గురించి నేను ఎప్పుడూ వినలేదు... వాళ్లు మెగాస్టార్ చిరంజీవితో సమానంగా నిలవడం నాకు థ్రిల్ కలిగించలేదు. ఒకవేళ చిరంజీవిగారు ఈ విషయంలో సంతోషంగా ఉంటే మాత్రం.. నేను కూడా సంతోషంగా ఉన్నట్టు నటిస్తా.. అని వర్మ తన తాజా ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే ఈ ట్వీట్‌పై వర్మని మెగా ఫ్యాన్స్ ఎలా ఆడుకోవాలో అలా ఆడుకుంటున్నారు.

మరీ ముఖ్యంగా.. నువ్విలా ఏడుస్తూనే ఉండు.. ఆయనలా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూనే ఉంటారంటూ మెగా ఫ్యాన్స్ చేస్తున్న కామెంట్స్ మాములుగా లేవు. తన వివాదపు వ్యాఖ్యలతో మెగా హీరోలని దెబ్బకొట్టాలనే వర్మ వ్యూహం.. తిరిగి తనకే తగిలే టైమ్ దగ్గరికి వచ్చింది. ఏం చూసుకుని వర్మ ఇదంతా చేస్తున్నాడో.. అదే తన పాలిట శత్రువుగా మారే రోజు ఎంత దూరంలో లేదంటూ మెగా ఫ్యాన్స్ చేస్తున్న కామెంట్స్ చూస్తుంటే.. ఏదో మ్యాటర్ అయితే ఉన్నట్లే అనిపిస్తుంది. చూద్దాం.. ఏం జరుగుతుందో..

RGV Insults Padma Winners:

Chiranjeevi Padma Vibhushan, RGV Insults Other Winners

Tags:   RAM GOPAL VARMA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ