శ్రీలీల అంటే ఒకప్పుడు క్రేజీ హీరోయిన్, లక్కీ హీరోయిన్, సూపర్ హీరోయిన్, సక్సెస్ ఫుల్ హీరోయిన్.. అసలెందుకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. అబ్బో ఇలానే శ్రీలీల వెంట పడ్డారు. కాని వరస ప్లాప్స్ వచ్చేసరికి శ్రీలీల ని ఒక్కసారిగా పక్కనబెట్టేస్తున్నారు. గత ఏడాది భగవంత్ కేసరితో మంచి హిట్ అందుకున్న శ్రీలీలని వరసగా యంగ్ హీరోలు మోసం చేసారు. భగవంత్ కేసరి హిట్ కూడా బాలయ్య ఖాతాలోకే వెళ్ళింది. ఇక యంగ్ హీరోలు వరసగా ఇచ్చిన షాక్ లతో గుంటూరు కారంపై హోప్స్ పెట్టుకుంటే.. సినిమా వసూళ్ళేమో కానీ శ్రీలీల కేరెక్టర్ ని తెగ విమర్శించేసారు.
దానితో శ్రీలీల ని ఐరెన్ లెగ్ అన్నారు. ఇప్పటికే విజయ్ దేవరకొండ చిత్రం నుంచి శ్రీలీల తప్పుకుంది అనే టాక్ ఉంది. మరోపక్క రవితేజ సినిమాలో అనుకున్నారు అదీ జరగలేదు. అయితే ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సలార్ తర్వాత కల్కి, మారుతి మూవీ రాజా సాబ్ తర్వాత స్పిరిట్ చెయ్యాల్సి ఉంది. ఆ తర్వాత హను రాఘవాపుడితో ఓ సినిమాకి కమిట్ అయ్యారనే న్యూస్ ఉంది. ఆ చిత్రంలోనే ప్రభాస్ పక్కన హీరోయిన్ గా శ్రీలీలని సెట్ చేసారని అన్నారు, ఇప్పుడు ఆ చిత్రంలో శ్రీలీలని హీరోయిన్ గా తీసుకుంటే కుదరదంటూ ప్రభాస్ ఫాన్స్ హను రాఘవపూడిని వేడుకుంటున్నారు.
ప్రభాస్ సినిమాలో శ్రీలీల అనగానే వద్దు బాబోయ్ ఆ హీరోయిన్ మనకొద్దు అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నారు. శ్రీలీల విషయంలో ఆమె ఫ్లాపులే ఆమె పాలిట బ్యాడ్ లక్ గా మారాయి. మరి ఇప్పుడప్పుడే హను తో ప్రభాస్ సెట్స్ మీదకి వెళ్ళడు. ఈలోపులో శ్రీలీలకి ఒక్క హిట్ తగిలినా ఆమె రాత మారిపోతుంది. ఫామ్ లోకి వచ్చేస్తుంది. అప్పటికి ప్రభాస్ ఫాన్స్ కూడా కూల్ అవుతారులే అంటున్నారు. ఏది ఏమైనా శ్రీలీల మీద అందరూ ఒక్కసారే పగబట్టేసినట్టుగా కనబడుతుంది వ్యవహారం.