రకుల్ ప్రీత్ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతుంది, ప్రేమికుడు జాకీ భగ్నానీ తో ఏడడుగులు నడిచేందుకు రకుల్ రెడీ అయ్యింది, ఫిబ్రవరిలోనే రకుల్-జాకీ భగ్నానీల పెళ్లి అంటూ సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. కానీ రకుల్-జాకీ భగ్నానీల నుంచి మాత్రం ఈ పెళ్లి పై ఇంకా కన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు. కానీ రకుల్ పెళ్లి వేడుకలు గోవాలో మొదలైపోయినట్లుగా బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. రకుల్-జాకీ లు గోవా వేదికగా ఫిబ్రవరి 22 న పెళ్లి చేసుకోబోతున్నారని.. కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది సన్నిహితుల మధ్యలోనే వీరి పెళ్లి జరగబోతుంది అని తెలుస్తోంది.
అయితే రకుల్ ప్రీత్-జాకీ భగ్నానీ ఇద్దరూ తమ పెళ్లిని పసందైన పాటల మధ్యలో చేసుకోవాలనుకుంటున్నారా. అందులో భాగంగానే విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ, కియారా-సిద్దార్థ్, రణ్వీర్ సింగ్-దీపికా ల వివాహాలకి వీడియో గ్రాఫర్ గా పని చేసిన విశాల్ పంజాబీనే రకుల్ పెళ్ళికి కూడా వీడియోగ్రఫీ చేయబోతున్నారట. అంతేకాదు.. విశాల్ పంజాబీ సౌండ్ మిక్సింగ్ లో నెంబర్ 1 అట. సూపర్ హిట్ పాటలని రి క్రియేట్ చేస్తూ కొత్త ట్యూన్స్ ని తయారు చేస్తారట, ఇంకా కొన్ని కొత్త పాటలు రెడీ చేసేందుకు కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా రంగంలోకి దిగుతున్నారట.
ఇక విశాల్ పంజాబీతో రకుల్ అండ్ జాకీలు తమ డేటింగ్ నుంచి పెళ్లి వరకు జరిగిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ తో ఓ ట్రాక్ కూడా తయారు చేయిస్తున్నారట. అంటే రకుల్ పెళ్లి ఓ రేంజ్ లోనే జరగబోతుందన్నమాట.