పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రంతో కానీ, సందీప్ వంగాతో కానీ సినిమా చేస్తాడని అనుకుంటున్నారు. అల్లు అర్జున్ ఆ ఇద్దరితో సినిమాలు కమిట్ అయ్యి ప్రకటించాడు. కానీ ఇప్పుడు గుంటూరు కారం రిజల్ట్ తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేసేందుకు అల్లు అర్జున్ సుముఖంగా ఉన్నాడా, లేడా ఆలోచనలో ఉన్నాడా అనే వార్త హైలెట్ అయ్యింది. అల్లు అర్జున్ త్రివిక్రమ్ ని సైడ్ చెయ్యడానికే బోయపాటి తో అల్లు అరవింద్ హడావిడిగా సినిమా అనౌన్స్ చేశారనే టాక్ మొదలయ్యింది. అయితే ఈ ప్రాజెక్టు ఎనౌన్సమెంట్ లో హీరో గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు.
అంటే అల్లు అర్జున్ కి బోయపాటిని సెట్ చెయ్యడానికి, త్రివిక్రమ్ ని తప్పించడానికే అనే సంకేతాలు కనిపిస్తున్నాయి. మరి బోయపాటి గత మూడు నెలలుగా గీత ఆర్ట్స్ లోనే స్టిక్ అయ్యి ఉన్నారు. కానీ ఇప్పుడు సంక్రాంతి సినిమాల రిజల్ట్ తర్వాత ఇలా సడన్ గా అల్లు అరవింద్ తో బోయపాటి సినిమా అనౌన్స్ చెయ్యడం పై అందరిలో ఏవేవో అనుమానాలు స్టార్ట్ అయ్యాయి. మరి కావాలనే త్రివిక్రమ్ ని తప్పించడానికేనా ఇవన్నీ అంటూ త్రివిక్రమ్ ఫాన్స్ కూడా కొంత డౌట్ పడుతున్నారు.