యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ కలయికలో భారీ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న దేవర మూవీ విడుదలతేదిపై రకరకాల రూమర్స్ గత మూడు రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దేవర part1 ఏప్రిల్ 5 కి విడుదల కాకపోవచ్చు, దేవర డేట్ మారితే ఆగష్టు 15 కి వెళ్ళవచ్చు అంటూ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. అయితే దేవర రిలీజ్ డేట్ ఛేంజ్ పై మేకర్స్ క్లారిటీ ఇవ్వకుండా కామ్ గా కనబడుతున్నారు. ఇప్పుడు దేవర పై ఓ క్రేజీ న్యూస్ హైలెట్ అయ్యింది.
ఆర్.ఆర్.ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా కావడంతో దేవర ఓవర్సీస్ రైట్స్ కి భారీ డిమాండ్ ఏర్పడినట్లుగా తెలుస్తోంది. దేవర ఓవర్సీస్ రైట్స్‌ను బడా సంస్థ హంసిని ఎంటర్‌టైన్‌మెంట్స్ సొంతం చేసుకుంది. ఇందుకోసం దేవర మేకర్స్ కి సదరు సంస్థ ఏకంగా రూ. 27 కోట్ల రూపాయలు అప్పజెప్పినట్లుగా టాక్. దేవర ఓవర్సీస్ రైట్స్ కోసం హంసిని ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఇచ్చిన మొత్తం ఎన్టీఆర్ సోలో కెరీర్‌లోనే టాప్ రికార్డు అంటున్నారు.
మరి గ్లోబల్ స్టార్ గా ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్ తోనే ఇంత భారీ డీల్ జరిగినట్లుగా ఎన్టీఆర్ ఫాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. దేవర చిత్రానికి సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుథ్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో జాన్వీ హీరోయిన్ గా నటిస్తుండగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఇంకా ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, చాకో సహా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.