ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. పార్టీలన్నీ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ జెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్నాయి. అయితే తాజాగా ఏపీ సీఎం, వైసీపీ అధినేత గురించి ఒక ఆసక్తికర వార్త వినిపిస్తోంది. అదంటంటే.. కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలని జగన్ డిసైడ్ అయ్యారట. అంటే.. టీడీపీకి చెందిన ముగ్గురు అగ్ర నేతలను ఆయన టార్గెట్ చేశారట. వారిలో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఉన్నారండోయ్.. ఇక మిగిలిన ఇద్దరూ ఎవరంటే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేస్.. అలాగే హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. ఈ ముగ్గురినీ ఓడించేందుకు వైసీపీ చెందిన ముగ్గురిని రంగంలోకి దింపారట.
గెలవడానికి స్కెచ్‌లు గీయాలి కానీ..
మొత్తానికి జగన్ ఎన్నికలు వచ్చాయంటే.. ఏదో ఒక సినిమా ఓ పనికి మాలిన దర్శకుడి చేత తీయించి రిలీజ్ చేయిస్తుంటారు. స్కెచ్‌ల్లో కూడా సినిమా గోలే. ఆ ముగ్గురినీ ఓడించేందుకు మరో ముగ్గురట. ఇలా స్టాలిన్ సినిమానైతే ఫాలో అవుతున్నారు కానీ అయ్యేదేనా? అసలు ప్రస్తుతం వైసీపీ, జగన్ ఉన్న పరిస్థితుల్లో గెలవడానికి స్కెచ్‌లు గీయాలి కానీ కుంభ స్థలం కొడతానంటే ఎలా? పైగా.. చంద్రబాబు, లోకేష్, బాలయ్యను ఓడిస్తే… రాబోయే ప్రభుత్వంలో మీకు కీలక పదవులు ఇస్తానని జగన్ ఆఫర్ కూడా ఇచ్చినట్టు సమాచారం. ఇప్పటికే ఆ ముగ్గురు నేతలను కుప్పం, మంగళగిరి, హిందూపురం నియోజకవర్గాల్లోకి దించారు. కుప్పంతో పాటు హిందూపురం బాధ్యతలను పెద్దిరెడ్డి తీసుకున్నారని సమాచారం.
కొనసాగుతున్న నేతల రాజీనామాల పర్వం..
కుప్పం బాధ్యతలు భరత్‌కు అప్పగించారట. చంద్రబాబును ఓడిస్తే భరత్‌కు మంత్రి పదవి ఆఫర్ చేశారట. ఇక మంగళగిరి బాధ్యతలను ఎంపీ విజయ్ సాయి రెడ్డి చూస్తున్నారు. ఆసక్తికర విషయమేంటంటే.. ఇక్కడ వైసీపీ పలు వర్గాలుగా చీలిపోయింది. ఆపై నేతల రాజీనామాల పర్వం కూడా కొనసాగుతోంది. ఇప్పటికే ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ళ రామకృష్ణారెడ్డి వైసీపీకి రిజైన్ చేసి కాంగ్రెస్ లో చేరారు. వచ్చే ఎన్నికల్లో గంజి చిరంజీవికి టికెట్ ఇవ్వనున్నారు ఈ క్రమంలోనే మరో నేత, ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సంకా బాలాజీ గుప్తా వైసీపీకి రాజీనామా చేశారు. ఇలా నేతలంతా చేజారి పోతుంటే మంగళగిరిలో పార్టీని ఎలా నిలబెట్టుకోవాలో చూడాలి కానీ టీడీపీని ఓడించడంపై ఫోకస్ పెడితే ఎలా? అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.