Advertisementt

అఖిల్ నెక్స్ట్ పై క్రేజీ న్యూస్

Fri 26th Jan 2024 07:36 PM
akhil akkineni  అఖిల్ నెక్స్ట్ పై క్రేజీ న్యూస్
Crazy news on Akhil Next అఖిల్ నెక్స్ట్ పై క్రేజీ న్యూస్
Advertisement
Ads by CJ

అక్కినేని అఖిల్ ఏజెంట్ మూవీ తర్వాత ఎలాంటి ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తాడో అనే క్యూరియాసిటీ ఇప్పటికి అక్కినేని అభిమానుల్లో నెలకొని ఉంది. వరస ఫెయిల్యూర్స్ తో అఖిల్ ప్రస్తుతం నెక్స్ట్ ప్రాజెక్ట్ ని ప్రకటించడానికి తటపటాయిస్తున్నాడు. అయితే అఖిల్ ధీర టైటిల్ తో కొత్త దర్శకుడు అనిల్ కుమార్ ని ఇండస్ట్రీకి పరిచయం చెయ్యబోతున్నాడు, ఏజెంట్ తర్వాత ధీర నే సెట్స్ మీదకి తీసుకువెళతారు అనే ప్రచారం జరిగింది. కానీ అది ఇప్పటివరకు పట్టాలెక్కలేదు.

ప్రస్తుతం అఖిల్ సెలెబ్రిటీ క్రికెట్ లీగ్ లో బిజీ కాబోతున్నాడు. CCL పూర్తి కాగానే అఖిల్ KGF, సలార్ మేకర్స్ హోంబులే ఫిలిమ్స్ తో చెయ్యి కలపబోతున్నాడంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందుకే అఖిల్ సలార్ పార్టీ కోసం బెంగుళూరు వెళ్ళాడు, లేదంటే ప్రత్యేకంగా అఖిల్ మాత్రమే ఎందుకు వెళతాడు, మిగతా హీరోలు వెళ్లకుండా, ఆ సలార్ నిర్మాతలతోనే అఖిల్ నెక్స్ట్ మూవీ ఉంటుంది.. అఫీషియల్ గా అనౌన్స్ చెయ్యడమే తరువాయి అని మాట్లాడుకుంటున్నారు. మరి అఖిల్ నెక్స్ట్ ధీరానా? లేదంటే హోంబులే ఫిలిమ్స్ తోనా? అనేది ఎప్పుడు క్లారిటీ వస్తుందో మరి.!

Crazy news on Akhil Next:

Akhil Akkineni next to be produced by Hombale Films

Tags:   AKHIL AKKINENI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ