టీడీపీ తో జనసేన పొత్తు ప్రకటించినప్పటినుంచి వైసీపి నేతలు, అనుకూల మీడియా కుత కుతా ఉడికిపోతుంది. లోకేష్ ని పవన్ ని విడగొట్టి వేడుక చూడాలని చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ సైలెంట్ గా ఉన్నా, టీడీపీ నేతలతో కనిపించకపోయినా, లేదంటే చంద్రబాబు-పవన్ కళ్యాణ్ మీటింగ్ ఆలస్యమైనా.. వీరి మధ్యన ఏదో జరిగింది అంటూ వార్తలు వండి వార్చారు, జనసేనకు సీట్ల పంపకంలో టీడీపీ జనసేనానిని అన్యాయం చేస్తుంది అంటూ వైసీపి వాళ్ళు గగ్గోలు పెట్టారు.
అయితే ఈ ఎన్నికల్లో కలిసి పోటీ చేసి గెలిచేస్తారేమో అని మధనపడుతున్న వైసీపి వాళ్ళకి ఈరోజు జరిగిన ఓ విషయం సంతృప్తిని ఇచ్చింది. టీడీపీ వాళ్ళు పొత్తు ధర్మాన్ని విస్మరించి రెండు సీట్లని ప్రకటించడంతో పవన్ కళ్యాణ్ కూడా కాస్త ఘాటుగానే అది ధర్మం కాదు అంటూ జనసేన నుంచి రెండు సీట్లని ప్రకటించడంతో వైసీపి నేతలే కాదు, వైసీపి అనుకూల బ్లూ మీడియా పండగ చేసుకుంటుంది. చంద్రబాబుకి - పవన్ కి చెడింది. ఢిల్లీకి వెళుతున్న పవన్, టీడీపీలో టెన్షన్, జనసేనలో సంబంధం లేకుండా టీడీపీ కీలక ఆదేశాలతో పవన్ మనసు గాయపడింది, లోకేష్ పవన్ ని చిన్న చూపు చూస్తున్నాడు, ఈ దెబ్బకి జనసేనలో జోష్ అంటూ పండగ చేసుకుంటుంది బ్లూ మీడియా.
మరి ఎప్పుడెప్పుడు పవన్-లోకేష్ లు విడిపోతారా అని కాచుకుని కూర్చున్న వైసీపి నేతలు, అనుకూల మీడియా ప్రస్తుతం హ్యాపీ మోడ్ లో కనబడుతుంది.