కళ్యాణ్ రామ్ సినిమా అమిగోస్ లో హీరోయిన్ గా తెలుగు తెరకు ఇంట్రడ్యూస్ అయిన ఆషిక రంగనాథ్ కి ఆ చిత్ర రిజల్ట్ అంతగా సంతృపిని ఇవ్వలేదు. ఆ తర్వాత చాలా రోజులకి కింగ్ నాగార్జున నా సామిరంగాలో నటించింది. సంక్రాంతికి విడుదలైన నా సామిరంగ ప్రేక్షకులకి నచ్చేయ్యడమే కాదు, ఆ చిత్రంలో క్యూట్ గా కనిపించిన ఆషిక రంగనాథ్ కి స్పెషల్ మార్కులు పడ్డాయి. నాగార్జునని డామినేట్ చేసేలా కొన్ని సీన్స్ లో ఆషిక రంగనాథ్ కనిపించింది అంటూ కొంతమంది కామెంట్స్ చేసారు.
తాజాగా ఆషిక రంగనాథ్ కుటుంభంలో పెళ్లి ఒకటి జరిగింది. ఆషిక సోదరుడి వివాహం అంగరంగ వైభవంగా జరగగా.. ఆ పెళ్ళిలో ఆషిక చేసిన సందడి అంతా ఇంతా కాదు. డిజైనర్ పీచ్ కలర్ హాఫ్ సారీ లో ఆషిక బ్యూటిఫుల్ గా క్యూట్ గా కనిపించింది. చేతులకి అందంగా మెహిందీ పెట్టుకుని పచ్చల జ్యువలరీతో ఏంజిల్ లా కనబడింది. ఆషిక రంగనాథ్ లేటెస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.