Advertisementt

రెండో పెళ్లిపై మెగా డాటర్ కామెంట్స్

Fri 26th Jan 2024 04:05 PM
niharika konidela  రెండో పెళ్లిపై మెగా డాటర్ కామెంట్స్
Mega daughter comments on second marriage రెండో పెళ్లిపై మెగా డాటర్ కామెంట్స్
Advertisement
Ads by CJ

మెగా డాటర్ నిహారిక పెళ్లి విషయంలో సోషల్ మీడియాలో జరిగిన చర్చ ఏ హీరోయిన్ విషయంలోనూ జరగలేదనే చెప్పుకోవాలి, పెద్దలు కుదిర్చిన వివాహాన్ని చైతన్య జొన్నలగడ్డతో అంగరంగ వైభవంగా చేసుకున్న నిహారిక ఓ ఏడాది పాటు భర్తతో షికార్లు చేసింది. ఆ తర్వాత భర్త చైతన్యతో వచ్చిన విభేదాలతో విడాకులు తీసుకుంది. నిహారిక భర్తకి విడాకులు ఇవ్వడం పెద్ద సెన్సేషన్ అవ్వడం కాదు.. నిహారికాని సోషల్ మీడియా వేదికగా చాలామంది ట్రోల్ చేసారు. నిహారిక విడాకుల విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పబ్లిక్ గా ప్రకటించింది.

పెళ్లి తర్వాత నటనవైపు కానీ, ఇండస్ట్రీలో పెద్దగా కనిపించని నిహారిక ఇప్పుడు మళ్ళీ నిర్మాతగా యాక్టీవ్ అయ్యింది. అయితే తాజాగా నిహారిక తన పెళ్లి, విడాకులపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పెళ్లి తర్వాత నేను సినిమాలు చెయ్యలేదు, పెళ్లి అయ్యాకే సినిమాలు మానేసాను అన్నారు, కానీ అది మా వృత్తి, మేమెందుకు సినిమాలు మానేస్తాం, నిర్మాతగా బిజీ కాబట్టే నటనకు దూరమయ్యాను, ఎవరైనా పెళ్లి చేసుకునేముందు ఒకరినొకరు తెలుసుకోవాలి, అది తెలియకుండా మనకు సెట్ అవ్వని వ్యక్తిపై ఆధారపడకూడదు. వాళ్ళు మన ఇంట్లో అమ్మా, నాన్నలా ఉండరు కదా.. అంత ప్రేమగా అస్సలు చూసుకోలేరు, అందుకే ఒంటరిగా ఎవరి మీద ఆధారపడకుండా ఉండడం నేర్చుకున్నాను.

నాది పెద్దలు కుదుర్చిన వివాహం, నేను విడాకులు తీసుకున్నప్పుడు చాలామంది చాలా అన్నారు. నన్ను, నా కుటుంబాన్ని బ్లేమ్ చేసారు. అది చూసి ఎంతో ఏడ్చాను, మానసికంగా బాధపడ్డాను, లైఫ్ లాంగ్ కలిసుండాలని పెళ్లిళ్లు చేసుకుంటారు, విడిపోవాలని ఎంతో ఖర్చు పెట్టి పెళ్లి చేసుకోరు. అందరూ కలిసి ఉండాలనే కోరుకుంటారు, నేనూ అదే కోరుకున్నాను. నా గురించి ఏం రాసినా పట్టించుకునేదాన్ని కాదు, కానీ నా కుటుంబాన్ని లాగారు, నా కేరెక్టర్ ని తప్పుబట్టారు, దూషించారు అదే నేను తట్టుకోలేకపోయాను, 

ఈ పెళ్లి, విడాకుల ద్వారా ఎవ్వరినీ నమ్మకూడదని ఫిక్సయ్యాను, ఎప్పటికీ ఇలా సింగిల్ గా ఉండిపోను, నాకింకా 30 ఏళ్ళే. ఎవరైనా మంచి వ్యక్తి దొరికితే పెళ్లి చేసుకుంటాను, నాకిదో గుణపాఠం అంటూ రాసుకొచ్చింది. అంటే దీన్ని బట్టి నిహారిక రెండో పెళ్ళికి సిద్దమే అన్నమాట. 

Mega daughter comments on second marriage:

Niharika Konidela comments on second marriage

Tags:   NIHARIKA KONIDELA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ