మలయాళంలో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన నేరు డిసెంబర్ 21 న థియేటర్స్ లో విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. ఆడియన్స్ మోహన్ లాల్ సినిమాని మెచ్చుకున్నారు. కోర్టు డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పుడు పలు భాషల్లో డబ్బింగ్ అయ్యి ఓటిటీ నుంచి అందుబాటులోకి వచ్చేసింది. తెలుగు ఆడియన్స్ ఎగబడి నేరు ని తెలుగులో వీక్షిస్తున్నారు. నేరు ని తెలుగులో చూసిన ప్రేక్షకులంతా ఎందుకు ఈ చిత్రాన్ని రీమేక్ చెయ్యకుండా వదిలేసారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మలయాళంలో మోహన్ లాల్-జీతూ జోసెఫ్ చిత్రాలని టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ రీమేక్ చేసేవారు. దృశ్యం సీరీస్ మొత్తం వెంకీ రీమేక్ చేసారు. సూపర్ హిట్స్ అందుకున్నారు. కానీ ఇప్పుడు ఈ నేరు చిత్రాన్ని ఎందుకలా వదిలేసారో అనేది అర్ధం కానీ పరిస్థితి. మోహన్ లాల్-ప్రియమణి కాంబోలో కళ్ళు లేని అమ్మాయి కి న్యాయం చేసే కథగా ఫుల్లీ కోర్టు డ్రామాగా వచ్చిన నేరు ని తెలుగు ప్రేక్షకులు విపరీతంగా ఆదరిస్తున్నారు. నేరు చూసిన ప్రతి ఒక్కరూ అప్రిషేట్ చేస్తున్నారు.
నేరు కొత్త కథేమీ కాదు, అలాగని కొత్తగానూ లేదు, కానీ మోహన్ లాలా కోర్టులో వాదించిన తీరు, అలాగే ప్రతివాదిగా ప్రియమణి తండ్రి కేరెక్టర్ చేసిన ఆయన కలిసి కోర్టు డ్రామాని రక్తి కట్టించడం అందరికి నచ్చేసింది. ఇది తెలుగులో ఏ హీరో అయినా రీమేక్ చేస్తే బావుండేది, ఎందుకు అలా వదిలేసారో అని మాట్లాడుకుంటున్నారు సినీ ప్రియులు.