Advertisementt

డేంజర్ జోన్ లో శ్రీలీల

Thu 25th Jan 2024 07:56 PM
sreeleela  డేంజర్ జోన్ లో శ్రీలీల
Sreeleela in the danger zone డేంజర్ జోన్ లో శ్రీలీల
Advertisement
Ads by CJ

వరస సినిమాలు, ఊపిరాడని షూటింగ్స్ , నిద్రలేని వర్క్.. అంటూ గత ఏడాదిన్నరగా క్యూట్ బ్యూటీ శ్రీలీల పరిస్థితి ఉంది. స్టార్ హీరోలు, యంగ్ హీరోలు అంటూ శ్రీలీల టాలీవుడ్ హీరోలందరిని తన చుట్టూ తిరిగేలా చేసింది. ఆమె క్రేజ్ ని పర్ఫెక్ట్ గా వాడుకోవడంలో దర్శకులు ఫెయిల్ అయ్యారో.. లేదంటే శ్రీలీల దురదృష్టమో ఆమె నటించిన సినిమాలు వరసగా ఫెయిల్ అయ్యాయి. గోల్డెన్ లెగ్ అని కీర్తించిన నోళ్లే.. ఇప్పుడు ఐరెన్ లెగ్ ముద్ర వేస్తున్నాయి. మరి నిద్రలేని రాత్రులు గడిపి, తన చదువుని కూడా త్యాగం చేసిన శ్రీలీలని దర్శకులు ఇంతగా లైట్ తీసుకున్నారా..

ఆమె టాలెంట్ ని వాడుకోవడంలో వారు విఫలమయ్యారా అనే అనుమానాలు వ్యక్తం చేసారు. మరోపక్క శ్రీలీల క్యూట్ నెస్, ఆమె డాన్స్ అన్నీ ఓకే.. కానీ కాస్త యాక్టింగ్ మీద ఫోకస్ పెట్టాలి, అలాగే ఆమె వాయిస్ విషయంలో ఇంకాస్త శ్రద్ద పెట్టాలనే కామెంట్స్ వినిపించాయి. ఇప్పుడు ఆమె కెరీర్ డేంజర్ జోన్ లో ఉంది అనే మాట వినిపిస్తోంది. ఎంత స్పీడుగా దూసుకొచ్చిందో.. అంతే స్పీడుగా కనుమరుగవుతుంది అనే అనుమానాలు మొదలయ్యాయి. ఇక ప్రస్తుతం శ్రీలీల చేతిలో ఉన్న విజయ్ దేవరకొండ మూవీ కూడా చేజారింది అనే న్యూస్ ఉంది. మరోపక్క పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ ఎప్పుడు మొదలవుతుందో అనేది తెలియని పరిస్థితి. 

ఇది తప్ప మరో సినిమా ఆమె చేతిలో లేదు, దర్శకనిర్మాతలు కూడా శ్రీలీలకి ప్రత్యామ్నాయం వెతుకుతున్నారనే టాక్ కూడా మొదలైంది. మరి ఈ లెక్కన శ్రీలీల డేంజర్ జోన్ లో ఉన్నట్లేగా..! 

Sreeleela in the danger zone:

Sreeleela film career in danger zone

Tags:   SREELEELA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ