ప్రస్తుతం టాలీవుడ్ లో థియేటర్స్ కొట్లాట కామన్ గా కనబడుతుంది. రీసెంట్ గానే సంక్రాంతి సినిమాల విషయంలో ఏం జరిగిందో ప్రతి ఒక్కరూ గమనించారు. ఐదు సినిమాల పోటీ లో రవితేజ ఈగల్ మేకర్స్ ని సమాధాన పరిచి సోలో డేట్ ఇస్తామని నిర్మాతలకి మాటిచ్చి మరీ సినిమా విడుదల వాయిదా వేయించారు. గుంటూరు కారం vs హనుమాన్ అన్న రేంజ్ లో థియేటర్స్ విషయంలో గొడవలు నడిచాయి. అందులో ఎవరు గెలిచారో, ఎవరు తగ్గారో కూడా అందరూ చూసారు. ఇక ఇప్పుడు ఫిబ్రవరి 9 డేట్ కోసం మరోసారి థియేటర్స్ పంపకాల దగ్గర గొడవ స్టార్ట్ అయ్యింది.
గతంలోనే ఫిబ్రవరి 9 న సందీప్ కిషన్ ఊరు పేరు భైరవకోన సినిమాని విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు. అందుకు అనుగుణంగా ప్రమోషన్స్ చేసుకున్నారు. కానీ అదే ఫిబ్రవరి 9 న రవితేజ ఈగల్ విడుదల అని మేకర్స్ డేట్ ఇచ్చేసారు. అప్పుడు మొదలైంది అసలు గోల. ఇప్పుడు విడుదలకు టైమ్ దగ్గరకొస్తున్న కొద్దీ అది పెరిగి పెద్దదైంది. రవితేజ ఈగల్ కోసం ఊరు పేరు భైరవకోన ని తప్పుకోమని, ఈగల్ కి సోలో డేట్ ఇస్తామంటూ మాటిచ్చినట్టుగా ప్రోడ్యుసర్ గిల్డ్ ఊరు పేరు మేకర్స్ ని అడుగుతుంది, ఒత్తిడి చేస్తుంది అంటూ సోషల్ మీడియాలో వచ్చేస్తున్నాయి.
ఇక యాత్ర 2 కూడా అదే వారం విడుదలవుతుంది. యాత్ర 2 వచ్చినా పర్లేదు, ఊరు పేరు భైరవ కోన డేట్ మార్చమని ప్రొడ్యూసర్ గిల్డ్ ఒత్తిడి అంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. అధికార పార్టీ కోసం యాత్ర 2 ని వదిలేసారు, ఇక ఊరు పేరు భైరవకోన తప్పుకుంటే ఈగల్ సోలోగా వస్తుంది అంటున్నారు. ప్రస్తుతం ఈ డేట్ పై ప్రొడ్యూసర్ గిల్డ్ మీటింగ్ పెట్టింది. ఆ మీటింగ్ లో ఏం తేలుస్తారో చూడాలి. అప్పుడు హనుమాన్ విషయంలో ఏం జరిగిందో.. ఇప్పుడు ఊరు పేరు విషయంలో అదే జరుగుతుందా.. ఊరు పేరు మేకర్స్ కూడా ప్రొడ్యూసర్ గిల్డ్ కి ఎదురెళ్తారా అనేది చూడాలి.