మృణాల్ ఠాకూర్.. సీత రామం, హాయ్ నాన్న చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గుడి కట్టించుకుంది. సీతారామంలో సాంప్రదాయంగా కనిపించిన మృణాల్.. హాయ్ నాన్న లో మోడ్రెన్ గర్ల్ గా కనిపించింది. అయితే గతంలో సీరియల్ ఆర్టిస్ట్ గా పని చేసిన మృణాల్ కి లక్కు కలిసొచ్చి సిల్వర్ స్క్రీన్ మీదకి షిఫ్ట్ అయ్యింది. ఇక్కడ సౌత్ లో ఆమెకి మంచి ప్రేమ కథలు పడుతున్నా.. హిందీలో మాత్రం మృణాల్ కి గ్లామర్ షో చేసే పాత్రలే వస్తున్నాయి.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ తనకి ప్రేమ కథలు చెయ్యడం అంటే ఇష్టమని, తనకి బాలీవుడ్ లో రొమాంటిక్ సినిమాలు రావడం లేదు, బహుశా తాను అక్కడ అంత ఫేమస్ కాదేమో, చాలా చిత్రాల్లో ఆఫర్స్ వస్తున్నా.. వాటిల్లో ప్రేమకథ చిత్రాలు తక్కువ అని చెప్పిన మృణాల్.. తనకి మాత్రం ప్రేమ కథల్లో నటించాలనుంది అని చెప్పింది. కానీ నేను డైరెక్టర్స్ చుట్టూ తిరిగి తిరిగి అలిసిపోయాను, చాన్సులు రావడం అనేది నేచురల్ గా జరిగిపోవాలి.
చాలామంది ప్రేమకథలు నచ్చవన్నట్టుగా ప్రవర్తిస్తారు, కానీ వాటిని చాటుగా చూడడానికి ఇష్టపడతారు. సీతారామం, హాయ్ నాన్న చిత్రాలు అందరి అభిప్రాయాలూ మార్చేసింది. ఏవి పడితే అవి చెయ్యకుండా నా పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలే చేస్తాను అంటూ చెప్పుకొచ్చింది.