Advertisementt

నయనతార భర్త విగ్నేష్ కి నోటీసులు

Thu 25th Jan 2024 02:33 PM
lic  నయనతార భర్త విగ్నేష్ కి నోటీసులు
LIC serves legal notice to Vignesh Shivan నయనతార భర్త విగ్నేష్ కి నోటీసులు
Advertisement
Ads by CJ

విగ్నేష్ శివన్ ప్రస్తుతం ప్రాబ్లెమ్ లో పడ్డాడు. నయనతార భర్తగా మారాక స్టార్ హీరోతో సినిమా చేసే ఛాన్స్ వస్తుంది అనుకుంటే.. ఆ ఛాన్స్ మిస్ అవడంతో లవ్ టుడే హీరో ప్రదీప్ రంగనాధన్ తో LIC మూవీని రెడీ చేసుకున్నాడు. రీసెంట్ గానే పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ చిత్రం పూజ రోజు నుంచే కాంట్రవర్సీలో ఇరుక్కుంది. LIC (లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్) సినిమా టైటిల్ తనదే, నేను ఎప్పుడో ఆ టైటిల్ ని రిజిస్టర్ చేసుకున్నాను అంటూ తమిళ నిర్మాత ఒకరు కోర్టుకెక్కారు.

ఆ వివాదం అలా ఉన్న సమయంలోనే LIC టైటిల్ పై ప్రముఖ జీవిత భీమా సంస్థ LIC వారు విగ్నేష్ శివన్ కి నోటీసులు ఇచ్చారు. లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ప్రజల్లో తమ సంస్థకి ఉన్న అపార నమ్మకం, కానీ ఇలాంటి టైటిల్ పెట్టి తమ సంస్థ గౌరవాన్ని దెబ్బ తీస్తుంది, ఆ టైటిల్ గనక మార్చకపోతే లీగల్ గా ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది అని విగ్నేష్ కి చెప్పారు. కానీ చిత్ర బృందమే నుంచి ఎలాంటి సమాధానం రాకపోయేసరికి.. ఇప్పుడు LIC సంస్థ విగ్నేష్ కి నిర్మాతలకి నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది.

ఇక విగ్నేష్ శివన్ ఇవేమి పట్టించుకోకుండా హీరోయిన్ కృతి శెట్టి, హీరో ప్రదీప్, కీలక పాత్రలో SJ సూర్యని తీసుకుని తన షూటింగ్ ఏదో తాను చేసుకుంటున్నాడు. మరి ఇప్పుడు విగ్నేష్ శివన్ ఈ నోటీసులపై ఎలా స్పందిస్తాడో చూడాలి. 

LIC serves legal notice to Vignesh Shivan:

LIC sends legal notice to Vignesh Shivan

Tags:   LIC
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ