Advertisementt

నారా లోకేష్ పై దుష్ప్రచారం

Thu 25th Jan 2024 11:13 AM
nara lokesh  నారా లోకేష్ పై దుష్ప్రచారం
Slander on Nara Lokesh నారా లోకేష్ పై దుష్ప్రచారం
Advertisement
Ads by CJ

యువగళం పాదయాత్రతో ఒక్కరిగా తన గ్రాఫ్ ని పెంచుకున్న యువ రాజకీయనాయకుడు నారా లోకేష్ పై వైస్సార్సీపీ ఎప్పటికప్పుడు దుష్ప్రచారానికి తెర లేపుతూనే ఉంటుంది. లోకేష్ ని పప్పు అంటూ రోజాలాంటి నేతలు విమర్శించని రోజు లేదు, ఒకప్పుడు దద్దిగానే ఉన్న లోకేష్ ఇప్పుడు యువగళం పాద యాత్రతో సానబట్టిన వజ్రంలా తయారయ్యాడంటూ తెలుగు దేశం కార్యకర్తలు మురిసిపోతున్నారు. అయితే ప్రస్తుతం చంద్రబాబు కూడా రాజకీయంగా బాగా బిజీగా కనిపిస్తున్నారు. ఈ మధ్యలో నారా లోకేష్ కొద్దిరోజులుగా యాక్టీవ్ గా లేరు. దానితో లోకేష్ పై వైసీపీ తప్పుడు వార్తలను సృష్టిస్తుంది.

సోషల్ మీడియా వేదికగా నారా లోకేష్ కనిపించడం లేదు అంటూ వైసీపీ నేతలు, వైసీపీ పార్టీ అభిమానుల ట్విట్టర్ హ్యాండిల్స్ నుంచి పోస్ట్ లు పెడుతున్నారు. అంతేకాకుండా అమెరికా పోలీసుల అదుపులో నారా లోకేష్! అమెరికాలో మనీ లాండరింగ్ కేసులో ఇరుక్కున్న నారా లోకేష్! ప్రస్తుతం అమెరికాలో పోలీసుల ఆధీనంలో ఉన్న నారా లోకేష్! అందుకే లోకేష్ ఎవ్వరికి కనిపించడం లేదు.. అంటూ తప్పుడు వార్తలు ప్రచురిస్తుంది. మరి ఇలాంటి దుష్ప్రచారాలు చేసి టీడీపీ క్రేజ్ ని, లోకేష్ క్రేజ్ ని ఏదో విధంగా తగ్గిద్దామనే భ్రమలో వైసీపీ వాళ్లు ఉన్నారేమో.. మా నాయకుడు వీటన్నిటి తగిన సమాధానాలు చెబుతాడు, జస్ట్ వెయిట్ అండ్ సి అంటూ తెలుగు దేశం కార్యకర్తలు కూడా ఘాటుగానే సమాధానం చెబుతున్నారు.

Slander on Nara Lokesh:

YCP social media misinformation on Nara Lokesh

Tags:   NARA LOKESH
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ