ఈరోజు జనవరి 25 న బాలీవుడ్ హీరో హ్రితిక్ రోషన్-దీపిక పదుకొనె కాంబోలో తెరకెక్కిన ఫైటర్ విడుదలైంది. రేపు రిపబ్లిక్ డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఫైటర్ పై నార్త్ లో భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు తగ్గ టాక్ నే హ్రితిక్ ఫైటర్ సొంతం చేసుకుంది. భారీ అంచనాల నడుమ నేడు విడుదలైన ఫైటర్ ని వీక్షించిన బాలీవుడ్ టాప్ క్రిటిక్ తరన్ ఆదర్శ్ ఫైటర్ కి ఏకంగా 4.5 రేటింగ్ ఇచ్చి, నటులు, దర్శకుడు గురించి పెద్ద రివ్యూని ఇవ్వడం చూసిన వారంతా ఫైటర్ అంత బావుందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ఫైటర్ ని వీక్షించిన కొంతమంది ప్రేక్షకులు ఇలా స్పందిస్తున్నారు. ఫైటర్ మూవీ మైండ్ బ్లోయింగ్‌గా ఉంది. స్క్రీన్ మీద హృతిక్ రోషన్, దీపిక పదుకోనే కెమిస్ట్రీ అదిరిపోయింది. యాక్షన్ సీన్లు మాత్రం హై లెవెల్‌లో ఉన్నాయి. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు గూస్‌బంప్స్ వస్తాయి. వీఎఫ్ఎక్స్, సినిమాటోగ్రఫి, BGM, స్టోరి లైన్, సిద్దార్థ్ ఆనంద్ డైరెక్షన్ వేరే లెవెల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఫైటర్ విలన్ కూడా పవర్‌ఫుల్‌గా ఉన్నాడు.. కానీ సినిమానే కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది.. జస్ట్ వన్ మోర్ స్లీప్ అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
హృతిక్ రోషన్ యాక్షన్ సీన్లలో అదరగొట్టాడు, ఫైటర్ సినిమాలో యాక్షన్ సీన్లు బాగున్నాయి. ఇంతకు ముందు ఎన్నడూ చూడని ఫీలింగ్ కలిగించాయి. ఈ సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్స్ లైఫ్ టైమ్ ఎక్స్‌పీరియెన్స్ అంటూ ఇంకొందరు ఫైటర్ చూసి స్పందిస్తున్నారు.