Advertisementt

దేవర-పుష్ప 2 : ఏంటీ గాసిప్స్..

Wed 24th Jan 2024 06:21 PM
devara  దేవర-పుష్ప 2 : ఏంటీ గాసిప్స్..
Devara release postponed దేవర-పుష్ప 2 : ఏంటీ గాసిప్స్..
Advertisement
Ads by CJ

గత రెండు రోజులుగా ఎన్టీఆర్ దేవర పోస్ట్ పోన్ అంటూ వస్తున్న వార్తలకు మేకర్స్ కూడా ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా కామ్ గా ఉన్నారు. సైఫ్ అలీ ఖాన్ గాయపడడం, ఆయన ఆసుపత్రి పాలవడం, ఎప్పుడు కోలుకుంటారో తెలియక యూనిట్ కూడా కంగారు పడుతుంది. ఈలోపులో దేవర పోస్ పోన్ న్యూస్ ఒక్కసారిగా వ్యాపించింది. నిన్నమొన్నటివరకు గుట్టు చప్పుడు కాకుండా జరిగిన షూటింగ్.. ఇప్పుడు ఈ విధంగా వాయిదా పడుతుంది అనే వార్తలతో బాగా హైలెట్ అవుతుంది. అయితే దేవర ఏప్రిల్ 5 నుంచి దసరాకు వెళ్లొచ్చని అంటుంటే.. కొత్తగా అల్లు అర్జున్ పుష్ప విడుదలవుతున్న ఆగస్టు 15 కి దేవర విడుదల తేదీ మారొచ్చని అంటున్నారు.

మరి అల్లు అర్జున్ తో ఎన్టీఆర్ తలపడతాడా అంటే.. కాదు.. పుష్ప 2 కూడా క్రిస్మస్ వీకెండ్ కి షిఫ్ట్ అవ్వొచ్చు, ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల రిలీజ్ డేట్స్ అన్నీ మారుతున్నాయి.. అంటూ మరిన్ని రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అటు పుష్ప ద రూల్ షూటింగ్ కూడా పూర్తి కాలేదు, అల్లు అర్జున్ అనారోగ్య కారణాలతో షూటింగ్ నెమ్మదిగా సాగుతుంది. అందుకే దేవర పుష్ప డేట్ కి, పుష్ప క్రిష్ట్మస్ కి వెళ్లిపోవచ్చని అంటున్నారు. మరి ఈ రకమైన గాసిప్స్ మేకర్స్ ఇచ్చే క్లారిటీ పైనే ఆగుతాయి.. లేదంటే ఇలాంటి వార్తలు పుడుతూనే ఉంటాయి. 

Devara release postponed:

NTR-Koratala Devara release postponed

Tags:   DEVARA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ