Advertisementt

RC16 పై ఇంట్రెస్టింగ్ న్యూస్

Wed 24th Jan 2024 05:44 PM
rc16  RC16 పై ఇంట్రెస్టింగ్ న్యూస్
Interesting news on RC16 RC16 పై ఇంట్రెస్టింగ్ న్యూస్
Advertisement
Ads by CJ

రామ్ చరణ్-శంకర్ కలయికలో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ విడుదల తేదీపై మేకర్స్ సస్పెన్స్ కొనసాగిస్తూనే ఉన్నారు. రామ్ చరణ్ బర్త్ డే వరకు గేమ్ ఛేంజర్ రిలీజ్  తేదీపై క్లారిటీ వచ్చే సూచనలు కనిపించడం లేదు. అయితే ఇప్పుడు రామ్ చరణ్ తదుపరి మూవీపై ఓ ఇంట్రెస్టిగ్ న్యూస్ బయటికి వచ్చింది. బుచ్చిబాబు దర్శకత్వంలో RC16 గా మొదలు కాబోయే మూవీ షూటింగ్ మార్చ్ లో మొదలయ్యే అవకాశం ఉంది.

ఏడాది కాలంగా బుచ్చిబాబు RC16 ప్రీ ప్రొడక్షన్ పనుల్లోనే మునిగిపోయి ఉన్నాడు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ గా ఏ ఆర్ రెహ్మాన్ ని సెట్ చేసిన బుచ్చి బాబు ఈ చిత్రం కోసం నటుల ఎంపిక మొదలు పెట్టాడు, అంతేకాకుండా ఇప్పుడు RC16 కోసం కొన్ని సెట్ వర్క్స్ ని కూడా మొదలు పెట్టినట్లుగా తెలుస్తుంది. రామ్ చరణ్-సుకుమార్ ల ఇండస్ట్రీ హిట్ చిత్రం రంగస్థలం చిత్రానికి సెట్ వర్క్స్ జరిగిన ప్రాంతంలోనే ఇప్పుడు RC16 సినిమా కోసం కూడా భారీ సెట్టింగ్స్ ని వేస్తున్నారట. ప్రస్తుతం బుచ్చిబాబు ఆ పనుల్లోనే తలమునకలై ఉన్నాడట. RC16 షూట్ మార్చ్ నుంచి మొదలు కానున్నట్టుగా టాక్ ఉంది.

Interesting news on RC16:

Crazy update in RC16

Tags:   RC16
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ