యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న దేవర పార్ట్ 1 ఏప్రిల్ 5 విడుదలపై సందిగ్ధం నెలకొంది. సైఫ్ అలీ ఖాన్ గాయపడడంతో దేవర షూటింగ్ కి బ్రేకులు పడ్డాయి. దానితో దేవర అనుకున్న సమయానికి రావడం అసాధ్యము, దేవర సమ్మర్ కి పోస్ట్ పోన్ అవ్వొచ్చనే ఊహాగానాలు స్టార్ట్ అయ్యాయి. అయితే కొంతమంది ఎన్టీఆర్ అభిమానులు దేవర పోస్ట్ పోన్ న్యూస్ లపై ఇలా స్పందిస్తున్నారు.
దేవర ఎప్పుడొచ్చినా బాక్సాఫీస్ విధ్వంసమే. 💥🔥 RRR తర్వాత వస్తున్న సినమా, ఆ అంచనాలను అధిగమిస్తాం, ఒక పక్క రాజకీయ ఒత్తిడులు, ఇంకో పక్క సినిమా అంచనాలు.. అన్ని విధాలా మనం హీరో కి సపోర్ట్ గా నిలబడాలి.. పోస్ట్ పోన్ విషయం బాధే .. కానీ తప్పదు.. ఎలా జరగాలి అని ఉంటే అల జరుగుద్ది .. అంటూ ఎన్టీఆర్ కి సపోర్ట్ చేస్తున్నారు.
మరికొందరు ఎన్టీఆర్ దేవర పోస్ట్ పోన్ పై ఏం ఫీల్ అవ్వొద్దు, అవుట్ ఫుట్ పర్ఫెక్ట్ గా ఉండాలి, ఎవ్వరూ దేవర మేకర్స్ ని ఒత్తిడి చెయ్యొద్దు.. కూల్ గానే రానివ్వండి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. దసరా మన కోసం వేచి చూస్తోంది అన్న అంటూ దేవర సినిమా పోస్ట్ పోన్ పై ఆయన అభిమానులు పై విధంగా స్పందిస్తున్నారు. మరికొంతమంది మాత్రం దేవర పోస్ట్ పోన్ పై క్లారిటీ ఇవ్వండి సామి అంటూ పోస్ట్ లు పెడుతున్నారు.