ఒకప్పుడు అనుపమ పరమేశ్వరన్ అంటే సాంప్రదాయానికి మారు పేరు, అనుపమ ఎప్పుడూ గ్లామర్ షో చెయ్యదు అనుకున్నారు. ఆమె నటించిన సినిమాలన్ని అదే రీతిలో కనిపించాయి. ఆమె నటించిన ఏ సినిమాలో అయినా అనుపమ కేరెక్టర్ చాలా అణుకువగా ఉంటుంది. కార్తికేయ 2 లో నార్త్ గర్ల్ గా కనిపించినా.. అనుపమ పరమేశ్వరన్ లో గ్లామర్ ఎక్కువగా కనిపించలేదు. కానీ ఇప్పుడు సిద్దు జొన్నలగడ్డతో ఆమె చేస్తున్న టిళ్ళు స్క్వేర్ మూవీలో మాత్రం అనుపమ కొత్త అవతార్ లో టూ గ్లామర్ షో చేస్తూ బోల్డ్ గా కనిపించబోతుంది.
తనకి అలాంటి గ్లామర్ కేరెక్టర్స్ సెట్ అవుతాయో, లేదో అని ఆమె ఈమధ్యన సోషల్ మీడియాలో టెస్ట్ చేసుకుంటున్నట్టుగా కనబడుతుంది. ఎందుకంటే కొద్ది రోజులుగా అనుపమ గ్లామర్ షో చేస్తూ ఊరిస్తుంది. చిట్టి పొట్టి ఫ్రాక్స్ మాత్రమే కాదు, సారీస్ లోను అందాలను అలా అలా ఆరబోస్తుంది. తాజాగా అనుపమ సారీ లుక్ వదిలింది. ఆ పిక్ చూస్తే యూత్ కి నిద్ర రాదు సరికదా.. ఏమైపోతారో అనేలా ఉన్నాయి అనుపమ అందాలు. అంతలా ఊరిస్తూ అనుపమ తన కొత్త పిక్స్ ని షేర్ చేసింది. ప్రసుతం అనుపమ పరమేశ్వరన్ గ్లామర్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.