కొద్ది రోజుల క్రితం ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ జాతకంపై ప్రముఖ జ్యోతిష్య నిపుణుడు వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆయన జాతకం ప్రకారం ప్రభాస్ కి ప్రస్తుతం మంచి రోజులు కాదు, ప్రభాస్ కు ఈ జన్మలో పెళ్లి కాదని, ఆయనకు పెళ్లి యోగం లేదని, ఆరోగ్యంపై కూడా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వేణు స్వామి సంచలనంగా మాట్లాడారు. ప్రభాస్ పెళ్లి విషయంలో సమస్యలు ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు. ఆయన వ్యక్తిగత జీవితంలోను సఫర్ అవుతున్నారంటూ వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు ఆయన అభిమానులకి కోపం తెప్పించాయి.
అయితే వేణు స్వామి చెప్పిన కొన్ని జాతకాలు నిజమవడంతో అటు అభిమానుల్లో కంగారు కూడా మొదలయ్యింది. తాజాగా ప్రభాస్ పెద్దమ్మ, కృష్ణం రాజు గారి భార్య శ్యామల దేవి గారు ప్రభాస్ జాతకంపై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఆయనెవరో ప్రభాస్ జాతకం అంటూ చెప్పారు, అసలు ప్రభాస్ జాతకం ఆయన తల్లిగారికి తప్ప మాకెవ్వరికి తెలియదు, అలాంటిది ఆయన ప్రభాస్ జాతకంపై చేసిన కామెంట్స్ అన్ని రూమర్స్, అవి ఎవరూ నమ్మాల్సిన అవసరమే లేదు అని కొట్టి పారేసారు.
శ్యామలాదేవి గారు యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ జాతకం పై ఇచ్చిన క్లారిటీ తో ఆయన అభిమానులు రిలాక్స్ అవుతున్నారు. ఇక ఇలాంటి వార్తలని ప్రభాస్ అసలు పట్టించుకోరంటూ ఆమె ఈ గాలి వార్తలని కొట్టిపారేశారు.