Advertisementt

చెల్లెలి నిశ్చితార్థంలో సాయి పల్లవి డాన్స్

Tue 23rd Jan 2024 06:06 PM
sai pallavi  చెల్లెలి నిశ్చితార్థంలో సాయి పల్లవి డాన్స్
Sai Pallavi lights up sister engagement చెల్లెలి నిశ్చితార్థంలో సాయి పల్లవి డాన్స్
Advertisement
Ads by CJ

నేచురల్ బ్యూటీగా తన నటనతో అందరి మదులని దోచేసిన సాయి పల్లవి ప్రస్తుతం తెలుగులో నాగ చైతన్య తండేల్ చిత్రంలోనూ, అలాగే తమిళ మూవీస్ షూటింగ్స్ తో బిజీగా వుంది. కొద్దిరోజులు ఎలాంటి ప్రాజెక్ట్స్ ఒప్పుకోని సాయి పల్లవి సడన్ గా మళ్ళి బిజీగా మారిపోయింది. అయితే తాజాగా సాయి పల్లవి తన సిస్టర్ ఎంగేజ్మెంట్ లో చేసిన డాన్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. మామూలుగానే సాయి పల్లవి సూపర్బ్ డాన్సర్. ఆమె తెలుగు ఈటీవీలో ప్రసారమైన ఢీ డాన్స్ షోలో కనిపించింది.

అంతేకాకుండా ఆమె నటించిన ప్రతి సినిమాలోనూ సాయి పల్లవి అదిరిపోయే డాన్స్ స్టెప్స్ తో ఆకట్టుకుంటుంది. చెల్లెలి నిశ్చితార్థంలో సాయి పల్లవి తన రిలేటివ్స్ తో కలిసి సందడి చేస్తూ డాన్స్ చేసింది. మరి సాయి పల్లవి నటిగా బిజీగా ఉండడంతో ఆమె సిస్టర్ పూజ కన్నన్ పెళ్ళికి రెడీ అవడంతో ఆమె తల్లితండ్రులు పూజకి ముందుగా పెళ్లి చేసే ఏర్పాట్లలో ఉన్నారు. అందులో భాగంగానే పూజ కన్నన్ కి నిశ్చితార్ధం జరిగింది. ఈ వేడుకకి సంబందించిన పిక్స్, సాయి పల్లవి డాన్స్ వీడియో అన్ని సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

Sai Pallavi lights up sister engagement :

Sai Pallavi lights up sister engagement with dance and family joy

Tags:   SAI PALLAVI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ