గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ దర్శకుడు శంకర్ కాంబోలో రెండున్నరేళ్ల క్రితమే మొదలైన గేమ్ ఛేంజర్ షూటింగ్ నత్తనడకన సాగుతుంది. ఎప్పుడో గత ఏడాదే షూటింగ్ కంప్లీట్ అవ్వాల్సింది.. మధ్యలో కమల్ హాసన్ ఇండియన్ 2 షూటింగ్ వలన శంకర్ గేమ్ ఛేంజర్ షూటింగ్ ని అలా అలా చేస్తూ వస్తున్నారు. గత ఏడాది మార్చి లో రామ్ చరణ్ బర్త్ డే కి టైటిల్, ఫస్ట్ లుక్ ఇచ్చాక మళ్ళీ ఇంతవరకు గేమ్ ఛేంజర్ పై ఎలాంటి అప్ డేట్ లేదు. అప్పుడే రామ్ చరణ్ బర్త్ డే మళ్ళీ రానే వచ్చింది. కానీ గేమ్ ఛేంజర్ విడుదల తేదీపై క్లారిటీ ఇవ్వకుండా సస్పెన్స్ క్రియేట్ చేస్తూనే ఉన్నారు.
గత ఏడాది దివాళికి ఫస్ట్ సింగిల్ అన్నారు, అదీ లేదు, దిల్ రాజు గేమ్ ఛేంజర్ ఈఏడాది సెప్టెంబర్ లో వినాయక చవితికి ఉండొచ్చని అన్నారు. అదేదో క్లారిటీ ఇస్తే బావుంటుంది అని మెగా ఫాన్స్ కోరిక. కానీ శంకర్ మాత్రం గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ పై ఇంకా ఇంకా సస్పెన్స్ నడిపిస్తూనే ఉన్నారు. కొంపదీసి రామ్ చరణ్ బర్త్ డే వరకు గేమ్ ఛేంజర్ డేట్ పై కామ్ గా ఉండి.. చరణ్ బర్త్ డే ట్రీట్ గా గేమ్ ఛేంజర్ విడుదల తేదీని ప్రకటిస్తారేమో అంటున్నారు. చూద్దాం శంకర్ ప్లానింగ్ ఎలా ఉందో అనేది.