బిగ్ బాస్ సీజన్ 7 లో స్పై బ్యాచ్ గా ప్రొజెక్ట్ అయిన శివాజీ, పల్లవి ప్రశాంత్, యావర్ లు బిగ్ బాస్ నుంచి బయటికొచ్చాక కూడా అదే ఫ్రెండ్ షిప్ ని కంటిన్యూ చేస్తున్నారు. శివాజీ ప్రస్తుతం 90s బయోపిక్ సక్సెస్ మూడ్ లో కనిపిస్తున్నాడు. బిగ్ బాస్ లో పెద్దన్నగా హైలెట్ అయిన శివాజీ బయట మిడిల్ క్లాస్ లెక్కల మాస్టర్ గా హైలెట్ అయ్యాడు. అయితే ఇంకా ఇంకా 90s బయోపిక్ ని ప్రమోట్ చేస్తున్న శివాజీ తాజాగా ఈటీవీలో వస్తున్న జబర్దస్త్ కి గెస్ట్ గా వెళ్ళాడు.
అక్కడ జబర్దస్త్ లో గెటప్ శ్రీను-ఆటో రామ్ ప్రసాద్ వేసిన సలార్ స్పూప్ స్కిట్ అదిరిపోగా.. ఆ తర్వాత భాస్కర్, నరెష్ లు పాతకాలపు స్కిట్ తో అదరగొట్టేసాడు. ఆ తర్వాత ఇమ్మాన్యువల్, బాబు వాళ్ళు బిగ్ బాస్ విన్నర్ గా పల్లవి ప్రశాంత్ బయటికొచ్చాక ఆయన ఫాన్స్ చేసిన రచ్చతో అరెస్ట్ అయిన సీన్స్ ని స్కిట్ కింద చేసారు. ఇమ్మాన్యువల్ ఫ్యాన్స్ లీడర్ గా బాబు పల్లవి ప్రశాంత్ గా కనిపించిన ఈ స్కిట్ చూసి కొన్నిసార్లు శివాజీ ఫీలైనట్టుగా, కొన్నిసార్లు శివాజీ నవ్వుకున్నట్టుగా ప్రోమో కట్ చేసారు. ఆ ప్రోమో చూసిన వారు జబర్దస్త్ లో పల్లవి ప్రశాంత్ అరెస్ట్ స్కిట్ చూసి శివాజీ మొహం మాడిపోయింది అంటూ వార్తలు అల్లేస్తున్నారు.