Advertisementt

ఎన్టీఆర్ అయోధ్య వెళ్లకపోవడానికి కారణం..

Mon 22nd Jan 2024 09:45 PM
jr ntr  ఎన్టీఆర్ అయోధ్య వెళ్లకపోవడానికి కారణం..
Reason Behind Jr Ntr Missing In Ayodhya ఎన్టీఆర్ అయోధ్య వెళ్లకపోవడానికి కారణం..
Advertisement
Ads by CJ

ఈరోజు సోమవారం దేశం మొత్తం రామనామ సంకీర్తనలతో మార్మోగిపోయింది. ప్రతి ఒక్క హిందువు రామనామాన్ని జపిస్తూ పులకించిపోయారు. అయోధ్యలో జరిగిన మహా ఘట్టం బాలరాముడి ప్రాణ ప్రతిష్ట కోసం ఆహ్వానం అందిన ప్రతి ఒక్కరూ కదిలారు. ప్రతి రాష్ట్రం నుంచి ప్రముఖులని ఈ రాముడి విగ్రహ ప్రతిష్టకు ఆహ్వానించారు. అమితాబ్ బచ్చన్ దగ్గర నుంచి అభిషేక్ బచ్చన్, రణబీర్ కపూర్, అలియా భట్,కత్రినా కైఫ్, చిరంజీవి, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, మోహన్ బాబు, ప్రభాస్, నయనతార ఇలా చాలామందికి అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందింది. 

అంతేకాకుండా టాలీవుడ్ నుంచి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని కూడా ఈ బాలరాముడి ప్రాణ ప్రతిష్ట కోసం ఆహ్వానించారు. మరి ఇలాంటి ఘట్టానికి ఆహ్వానం అందితే ఆగుతారా.. మెగాస్టార్ చిరు, పవన్, చరణ్, ఇలా అందరూ అందులో భగంగా కావడం కోసం కదిలారు. కానీ యంగ్ టైగర్ ఈ కార్యక్రానికి హాజరు కాకపోవడంపై ఆయన అభిమానుల్లోనే అసంతృప్తి. ఇలాంటి అరుదైన ఘట్టానికి హాజరు కాకపోవడం ఏమిటి అని మాట్లాడుకుంటున్నారు. ఎన్టీఆర్ వెళ్ళాల్సింది. వెళితే బాగుండేది అంటున్నారు.

అయితే ఎన్టీఆర్ దేవర షూటింగ్ పని మీదే బిజీ షెడ్యూల్స్ ఉండడం తోనే అయోధ్యకి వెళ్ళలేదు అంటున్నారు.. కానీ దేవర విలన్ పాత్రధారి సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్య రీత్యా ఆసుపత్రిలో ఉన్నారు. ఆ విషయం తెలియని ఎన్టీఆర్ దేవర షూటింగ్ కోసం హైదరాబాద్ లోనే ఉండిపోయారని, అయోధ్యకి అందుకే వెళ్లలేకపోయారనే న్యూస్ వినిపిస్తోంది. 

Reason Behind Jr Ntr Missing In Ayodhya :

Reason Behind Jr Ntr Missing In Ayodhya Event

Tags:   JR NTR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ