మెగా చిన్న కోడలిగా తన మార్క్ చూపిస్తున్న లావణ్య త్రిపాఠి.. ప్రస్తుతం ఓ వెబ్ సీరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈరోజు సోమవారం అయోధ్యలో విగ్రహ పునః ప్రతిష్ట కార్యక్రమం కన్నుల పండుగ జరగగా.. దేశమంతటా ఆ వేడుకని అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా లావణ్య త్రిపాఠి చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాముని జన్మ స్థలమైన అయోధ్యలో పుట్టిన నేను రాముడి ప్రాణ ప్రతిష్ట వేడుకని ఇలా తిలకించడం అదృష్టంగా భావిస్తున్నాను.
నాతో సహా భారతీయులందరు ఇది గర్వించదగిన విషయం. ఈ సందర్భంగా నేను రామ్ పరివార్ హారాన్ని ధరించడం అదృష్టంగా భావిస్తున్నాను, రాముడి ప్రతిష్ట కోసం దేశం మొత్తం ఏతాటిపైకి వచ్చి సంబరాలు చేసుకుంటుంది, ఇది మనందరినీ ఏకం చేసే ఉత్సవం. అయోధ్యలోనే కాదు దేశం మొత్తం శాంతియుతంగా ఉండాలని కోరుకుందాం.. జై శ్రీరామ్ అంటూ లావణ్య త్రిపాఠి సంప్రదాయంగా చీరలో ఉన్న ఫొటోస్ ని షేర్ చేసింది.