తేజ సజ్జా తో హనుమాన్ అంటూ 200 కోట్ల క్లబ్బులో అడుగుపెట్టిన ప్రశాంతవర్మ పేరు ఇప్పుడు ఎటు చూసినా మార్మోగిపోతోంది. హనుమాన్ సంక్రాంతి ఫెస్టివల్ సందర్భంగా పెద్ద సినిమాలతో పోటీ పడి ఇప్పుడు పెద్ద నెంబర్లు ని నమోదు చేసి అందరితో శెభాష్ అనిపించుకున్న ప్రశాంతవర్మ యూనివర్స్ నుంచి ఈ చిత్రం వచ్చింది. తన దగ్గర 12 కథలు ఉన్నాయి, ప్రతి సినిమా డివోషనల్ టచ్ తో ముడిపెట్టిన కథలతో ఉంటుంది అని చెప్పిన ప్రశాంత్ వర్మ తన నుంచి నెక్స్ట్ రాబోయే జై హనుమాన్ లో మాత్రం తేజ సజ్జా హీరో కాదని చెప్పాడు.
జై హనుమాన్ గా స్టార్ హీరో కనిపిస్తారని, తేజ సజ్జా హనుమంతుగానే కనిపిస్తాడంటూ రివీల్ చేసాడు. భారీ బడ్జెట్ తో జై హనుమాన్ ని తెరకెక్కిస్తానని, హనుమాన్ కన్నా 100 రేట్ల భారీ స్థాయిలో జై హనుమాన్ ఉంటుంది, ఈ చిత్రంలో హీరో.. జై హనుమాన్ పాత్రలో కనిపిస్తాడు, దాని కోసం స్టార్ హీరోని తీసుకుంటాను అంటూ ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చాడు. జై హనుమాన్ ని 2025 లో ఖచ్చితంగా విడుదల చేస్తాను అంటూ ప్రశాంత్ వర్మ హామీ ఇచ్చాడు.