Advertisementt

NBK109 లో బాలయ్య అలా కనిపిస్తారా?

Mon 22nd Jan 2024 12:31 PM
nbk109  NBK109 లో బాలయ్య అలా కనిపిస్తారా?
Crazy update on NBK109 NBK109 లో బాలయ్య అలా కనిపిస్తారా?
Advertisement
Ads by CJ

నందమూరి నట సింహ బాలకృష్ణ-దర్శకుడు బాబీ కాంబోలో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న NBK109 చిత్రం షూటింగ్ చాలా ఫాస్ట్ గా చిత్రీకరిస్తున్నారు. బాలకృష ఏపీ ఎన్నికల సమయానికల్లా షూటింగ్ ని కంప్లీట్ చేసేసే ఆలోచనలో ఉన్నారు. అయితే ఈ చిత్రంలో బాలయ్య డ్యూయెల్ రోల్ లో కనిపించబోతున్నట్లుగా టాక్ ఉంది. ఈ సినిమాలోని సెకండ్ హాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ పై ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో క్రేజీగా వైరల్ అయ్యింది. 

ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో బాలయ్య పూర్తిగా అరవై ఏళ్ల ఓల్డ్ గెటప్ లో, రఫ్ అండ్ రగ్గుడ్ లుక్ లో కనిపిస్తారని, ఈ ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే సీన్స్ కూడా భారీ యాక్షన్ తో ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో పాలిటిక్స్ నేపథ్యంలో నడవకపోయినా.. పవర్ఫుల్ పొలిటికల్ డైలాగ్స్ ఉండబోతున్నాయని చెబుతున్నారు. ఇంకా ఈ చిత్రంలో బేబీ డియోల్ విలన్ రోల్ లో కనిపిస్తుండగా.. ఇప్పుడు బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఓ కీ రోల్ లో కన్పిస్తారనే న్యూస్ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

Crazy update on NBK109 :

NBK109 update 

Tags:   NBK109
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ