నాలుగు సినిమాలు చేతిలో ఉంటే గోల్డెన్ లెగ్గు, మూడు సినిమాలు ప్లాప్ అయితే ఐరెన్ లెగ్గు అనడం కామనైపోయింది. గతంలో కృతి శెట్టి వరసగా హ్యాట్రిక్స్ కొట్టేసరికి గోల్డెన్ బ్యూటీ అని పొగిడినోళ్లే.. ఇప్పుడు ఆమెని ఐరెన్ లెగ్గు అని ముద్రవేశారు. సేమ్ టు సేమ్ అదే సిస్ట్యువేషన్ లో హీరోయిన్ శ్రీలీల ఉంది. ధమాకా హిట్ తర్వాత గోల్డెన్ బ్యూటీగా పొగిడిన వారు ఇప్పుడు ఆమెని ఐరెన్ లెగ్గు అంటూ తెగుడుతున్నారు. అయితే శ్రీలీలకి అందం ఉంది, డాన్సులు బాగా చేస్తుంది, మంచి గ్లామర్ షో చేస్తుంది.
కానీ శ్రీలీల పెరఫార్మెన్స్ విషయంలో వీక్ అనే విమర్శలు మొదలయ్యాయి. ఆమె కాస్త ఎక్కువగా ఓవరేక్షన్ చేస్తుంది అంటున్నారు.. శ్రీలీల వాయిస్ కూడా మరీ మందంగా అనిపిస్తుంది. స్కంద సినిమా అప్పుడే శ్రీలీల వాయిస్ పై ఈరకమైన విమర్శలు వినిపించాయి. అయితే ఆమెకి కాస్త నటన నేర్పండి అంటూ కొంతమంది సలహాలు కూడా ఇస్తున్నారు. అందం, డాన్స్, ఎనర్జి ఇలా అన్నీ ఉన్నా ఆమె నటనలో తేలిపోతుంది. గుంటూరు కారం చూసిన చాలామంది శ్రీలీల ని చూడలేకపోయాం, ఆమె ఓవరేక్షన్ భరించలేకపోయామంటూ కామెంట్స్ చేసున్నారు.
మరికొంతమంది ఆ అమ్మాయి చిన్న పిల్ల, నేర్చుకుంటుందిలే.. అనుభవం లేక వరసగా సినిమాలు ఒప్పేసుకుని తడబడింది. వరస షూటింగ్స్ చేస్తూ తికమక అయ్యింది, డాన్సుల్లో ఎంత ఈజ్ చూపిస్తుంది. అదే మాదిరిగా ఆమె నటనలోనూ దిట్ట అవుతుందిలే అంటూ శ్రీలీలకి సపోర్ట్ చేస్తున్నారు.