ఈరోజు అయోధ్య రామమందిర నిర్మాణ ప్రారంభోత్సవానికి ప్రత్యేక అతిధులుగా పలువురు సెలబ్రిటీస్ హాజరవుతున్నారు. టాలీవుడ్ నుంచి రామమందిర నిర్మాణ ప్రారంభోత్సవానికి మెగా హీరోలతో పాటుగా పలువురు ప్రముఖులకు ప్రత్యేక ఆహ్వానాలు అందాయి. అందులో మెగాస్టార్ చిరంజీవి అయోధ్యలో జరగబోయే రామమందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి సతి సమేతముగా హాజరవుతున్నట్లుగా ఇప్పటికే ప్రకటించారు. అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ ఇలా అందరికి ఆహ్వానాలు అందాయి.
ఈరోజు సోమవారం జరగబోయే ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరు భార్య సురేఖతో కలిసి స్పెషల్ ఫ్లైట్ లో సాంప్రదాయక వస్త్రాల్లో హాజరవుతున్నారు. ఇదే స్పషల్ ఫ్లైట్ లో రామ్ చరణ్ కూడా ట్రెడిషనల్ గా రామ మందిర నిర్మాణ కార్యక్రమానికి హాజరు కావడానికి ప్రత్యేకంగా కదిలిన ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.