Advertisementt

సలార్ 2లో అఖిల్.. నిజమేనా అంటే?

Sun 21st Jan 2024 06:27 PM
akhil in salaar2  సలార్ 2లో అఖిల్.. నిజమేనా అంటే?
Makers Clarify on Akhil in Salaar Shouryanga Parvam సలార్ 2లో అఖిల్.. నిజమేనా అంటే?
Advertisement
Ads by CJ

రెబల్ స్టార్ ప్రభాస్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వచ్చిన సలార్ సినిమా బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. సుమారు రూ. 700 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి.. మరోసారి ప్రభాస్ సత్తా చాటింది. ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలోకి వచ్చేసింది. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోనూ సలార్ సునామీలా దూసుకెళుతోంది. సలార్ చూసిన వారంతా శౌర్యాంగపర్వం కోసం వేచి చూస్తున్నారు. పార్ట్ 1లో ఉన్న ఎన్నో సందేహాలకు పార్ట్ 2 సమాధానం చెప్పాల్సి ఉంది. అందుకే ఎప్పుడెప్పుడు పార్ట్ 2 వస్తుందా? అని ప్రేక్షకులు, ఫ్యాన్స్ వేచి చూస్తున్నారు. అయితే ఈలోపు ఒక వార్త ఈ సినిమాని వార్తలలో ఉంచుతోంది. 

అదేంటంటే.. సలార్ పార్ట్ 2లో అక్కినేని హీరో అఖిల్ కూడా గెస్ట్ రోల్ చేయబోతున్నాడనేలా.. టాలీవుడ్ సర్కిల్స్‌లో కొన్ని రోజులుగా ఓ వార్త వైరల్ అవుతోంది. అయితే ఈ వార్తపై మాత్రం ఇంత వరకు ఎవరూ క్లారిటీ ఇవ్వలేదు. ఈ మధ్య జరిగిన సలార్ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో అఖిల్ కనిపించడంతో.. సలార్‌ 2లో అఖిల్ నిజంగానే గెస్ట్ రోల్ ఉందనేలా అంతా ఫిక్స్ అయ్యారు. కానీ సలార్ 2‌లో అఖిల్ నటించడం లేదనేలా ఇప్పుడు క్లారిటీ ఇచ్చింది. 

తాజాగా ప్రశాంత్ నీల్ వైఫ్ లిఖిత.. ఇన్‌స్టాగ్రమ్‌లో కాసేపు నెటిజన్లతో ముచ్చటించారు. ఆమెకు అఖిల్ గెస్ట్ రోల్ నిజమేనా? అనేలా ఓ ప్రశ్న ఎదురైంది. దీనికి లిఖిత స్పందిస్తూ.. ఆ వార్తలో ఎటువంటి నిజం లేదని అన్నారు. కావాలని ఎవరో పుట్టించిన రూమర్ మాత్రమే అని ఆమె క్లారిటీ ఇచ్చారు. దీంతో సలార్ 2లో అఖిల్ అనే వార్తలకు ఫుల్‌స్టాప్ పెట్టినట్లయింది. ఇంకా ఈ చిట్ చాట్‌లో సినిమాకు సంబంధించి ఆమె అనేక ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఆమె సమాధానాలు చూస్తుంటే.. సలార్ 2 ప్రభంజనం మాములుగా ఉండదనేది మాత్రం అర్థమవుతోంది.

Makers Clarify on Akhil in Salaar Shouryanga Parvam:

Akkineni Prince in Salaar 2,Here is Clarity

Tags:   AKHIL IN SALAAR2
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ