DNS అంటే ధనుష్, నాగార్జున, శేఖర్ కమ్ముల. ఈ కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కబోతోంది. రీసెంట్‌గానే ఈ సినిమాను లాంచ్ చేశారు. ఈ రేర్ కాంబినేషన్‌లో తెరకెక్కే సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభమైనట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు మేకర్స్ ఒక్కొక్కటిగా అప్డేట్ వదులుతున్నారు. తాజాగా ఈ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరనేది మేకర్స్ ప్రకటించారు.
ఈ సినిమాకు నేషనల్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్, రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. సెన్సిబుల్, కంటెంట్ రిచ్ మూవీస్ చేయడంలో శేఖర్ కమ్ములది ప్రత్యేకమైన శైలి. అలాంటి శేఖర్ కమ్ముల సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అంటే.. ఇక్కడే ఈ సినిమా సగం సక్సెస్ సాధించిన ఫీలింగ్ వచ్చేస్తోంది. ఎందుకంటే కంటెంట్ బేస్డ్ సినిమాలకు దేవిశ్రీ అలాంటి ఆల్బమ్స్‌ని ఇస్తాడు మరి. ఈ కాంబినేషన్‌లో వచ్చే ఆల్బమ్ కూడా సెన్సేషనల్ హిట్ అవడం కాయమనేలా ఈ అప్డేట్‌తోనే వార్తలు వైరల్ అవుతున్నాయంటే.. దేవిశ్రీ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాను శ్రీ నారాయణ్ దాస్ కె నారంగ్ ఆశీస్సులతో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP (ఏషియన్ గ్రూప్ యూనిట్), అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్ పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావులు సంయుక్తంగా నిర్మిస్తునారు. సోనాలి నారంగ్ సమర్పిస్తున్నారు. ఈ సినిమాపై భారీగానే అంచనాలున్నాయి.