Advertisementt

రష్మికతో నిశ్చితార్థం.. విజయ్ స్పందనిదే

Sat 20th Jan 2024 02:55 PM
vijay deverakonda  రష్మికతో నిశ్చితార్థం.. విజయ్ స్పందనిదే
Vijay Deverakonda Clarity About Engagement with Rashmika Mandanna రష్మికతో నిశ్చితార్థం.. విజయ్ స్పందనిదే
Advertisement
Ads by CJ

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్‌ రష్మిక మందన్నాలకు త్వరలో నిశ్చితార్థం అంటూ ఈ మధ్య ఒకటే వార్తలు. అటు రష్మిక, ఇటు విజయ్ టీమ్ ఈ వార్తలపై వివరణ ఇచ్చినప్పటికీ.. ఈ నిశ్చితార్థపు వార్తలు మాత్రం ఆగడం లేదు. దీంతో విజయ్, రష్మిక ఈ వార్తలపై రెస్పాండ్ అవడమే మానేశారు. ఎందుకంటే, ప్రతి సంవత్సరం వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, పెళ్లి చేసుకోబోతున్నారనేలా వార్తలు వైరల్ అవడం సహజమే. అందుకే ప్రతి సారి చెప్పి చెప్పి.. ఇక లైట్ తీసుకున్నారు. తాజాగా విజయ్ దేవరకొండకి మరోసారి ఇదే ప్రశ్న ఎదురైంది. 

విజయ్‌కు తన తాజా ఇంటర్వ్యూలో రష్మికతో నిశ్చితార్థం అంటగా.. ఎప్పుడు? అనే ప్రశ్న ఎదురైంది. దీనికి విజయ్ దేవరకొండ స్పందిస్తూ.. ఫిబ్రవరిలో నిశ్చితార్థం.. పెళ్లి మాత్రం జరగదు. ఇలా రెండేళ్లకు ఒకసారి కొన్ని మీడియా సంస్థలు నాకు పెళ్లి చేస్తున్నాయి. నేను బ్యాచ్‌లర్‌గా ఉండటం వాళ్లకి ఇష్టం లేనట్లుగా ఉంది. ఎప్పుడూ ఇలాంటి రూమర్ స్ప్రెడ్ చేస్తూనే ఉన్నారని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు విజయ్ మాట్లాడిన ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విజయ్ క్లారిటీతో ఇకనైనా ఈ రూమర్స్‌కు ఫుల్‌స్టాప్ పడుతుందేమో చూద్దాం. 

విజయ్ దేవరకొండ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన గీత గోవిందం దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో ఫ్యామిలీ స్టార్ అనే చిత్రం చేస్తున్నారు. మరో చిత్రం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతోంది. రష్మిక మందన్నా పుష్ప 2 సినిమాలోనూ, రెయిన్ బో చిత్రంలోనూ నటిస్తోంది. ఈ రెండు సినిమాలు ప్రస్తుతం సెట్స్‌పై ఉన్నాయి. 

Vijay Deverakonda Clarity About Engagement with Rashmika Mandanna:

Vijay Devarakonda Condemned Engagement with Rashmika

Tags:   VIJAY DEVERAKONDA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ