ప్రభాస్ లేటెస్ట్ చిత్రం సలార్ భారీ అంచనాల నడుమ గత నెల 22 న ప్యాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కన్నడ సంచలనం ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సలార్ మూవీ ప్రేక్షకుల అంచనాలు అందుకోవడంలో సఫలీకృతం అయ్యింది. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ ప్లాప్ ల తర్వాత వచ్చిన సలార్ హిట్ అవడంతో ప్రభాస్ అండ్ బ్యాచ్ ఇప్పటికే రెండుసార్లు సక్సెస్ పార్టీ చేసుకున్నారు. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించారు. రీసెంట్ గా బెంగుళూరులో జరిగిన పార్టీకి ప్రభాస్ మరియు ప్రశాంత్ నీల్, శృతి హాసన్ మరియు నిర్మాతలు టాలీవుడ్ హీరో అఖిల్ లాంటి స్టార్స్ హాజరయ్యారు.
ప్రస్తుతం థియేటర్స్ లో ఇంకా రన్ అవుతున్న సలార్ మూవీ ఓటిటి రిలీజ్ పై ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. ప్రభాస్ సలార్ చిత్ర డిజిటల్ రైట్స్ ని ఫ్యాన్సీ డీల్ తో నెట్ ఫ్లిక్స్ చేజిక్కుంచుకుంది. అదే విషయాన్ని రీసెంట్ గా సంక్రాంతి రోజు పోస్టర్ వేసి మరీ ప్రకటించారు. ఇక ఈ చిత్రం థియేటర్స్ లో విడుదలైన 45 రోజుల తర్వాతే ఓటిటిలో స్ట్రీమింగ్ చెయ్యాలని మేకర్స్ ఒప్పందం చేసుకున్నారట. ఇక ఆ లెక్క ప్రకారం సలార్ మూవీ ఫిబ్రవరి 4 న కానీ, ఫిబ్రవరి 9 న కానీ ఓటిటి నుంచి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అంటున్నారు.