ప్రస్తుతం గుంటూరు కారం ప్రతి ఏరియాలో మంచి నెంబర్లనే నమోదు చేస్తుంది. జనవరి 12 న గుంటూరు కారం విడుదలైన తర్వాత సోషల్ మీడియా ఓపెన్ చేస్తే.. గుంటూరు కారం డిసాస్టర్, త్రివిక్రమ్ డిసాస్టర్ చిత్రం అజ్ఞాతవాసి పీడకలలు గుర్తు చేసింది.. అంటూ అజ్ఞాతవాసి హాష్ టాగ్ ని ట్రెండ్ చేసారు యాన్తి ఫాన్స్. నిజమే మహేష్ బాబు యాక్టింగ్ సూపర్బ్, ఆయన డాన్సులు అదుర్స్, రమణగాడి పాత్రలో మహేష్ చించేసాడు.. ఇలా మహేష్ ని పొగిడిన నోళ్లే.. త్రివిక్రమ్ దర్శకత్వాన్ని, కథని, థమన్ మ్యూజిక్ ని తిట్టిపారేసారు. శ్రీలీల ఓవరేక్షన్ పై కూడా బోలెడన్ని విమర్శలు వచ్చాయి.
కానీ మహేష్ బాబు కి ఉన్న ఫ్యామిలీ ఆడియన్స్ బలం, సంక్రాంతి సెలవుల సాయంతో గుంటూరు కారం నిలబడింది. ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలో, టాక్ కి అతీతంగా కలెక్షన్స్ డ్రాప్ అవకుండా మహేష్ తన స్టార్ డంతో సినిమాను నిలబెట్టాడు. గుంటూరు కారం డామేజ్ ఏమైనా అయితే అది త్రివిక్రమ్ బ్రాండ్ కి జరిగింది తప్ప మహేష్ వరకు ఫుల్ మార్క్ పడ్డాయి. మొదటిరోజు వచ్చిన టాక్ బయ్యర్లను భయపెట్టింది. కానీ ఇప్పుడు గుంటూరు కారం కలెక్షన్స్ చూసాక మహేష్ స్టామినా తెలిసింది అంటున్నారు.
సోషల్ మీడియాలో ఈరోజు కనిపించిన గుంటూరు కారం ట్వీట్స్
DAY 1: Disaster.. Agnyaathavaasi 2
DAY 2 : Below Average
DAY 3: Decent film. OTW
DAY 4: Hit Bomma
DAY 5: blockbuster film అంటూ కనిపించడం మహేష్ ఫాన్స్ కి కొత్త ఉత్సాహాన్ని తెచ్చింది.. కూసింత ఊపిరి పోసింది.