Advertisementt

వెంకి జెడ్జ్మెంట్ కి వంకలు

Wed 17th Jan 2024 03:14 PM
venkatesh  వెంకి జెడ్జ్మెంట్ కి వంకలు
Saindhav is a disappointing, annoying fare వెంకి జెడ్జ్మెంట్ కి వంకలు
Advertisement
Ads by CJ

పండగ సెలవలని, ఫెస్టివ్ మూడ్ ని క్యాష్ చేసుకోవాలనే ఆరాటంలో ఏ జోనర్ బడితే ఆ జోనర్ లో సినిమా చేస్తే ఫలితం ఎలా ఉంటుందో అనేది విక్టరీ వెంకటేష్ 75 వ చిత్రం సైంధ‌వ్ నిరూపించింది. ఎప్పుడో డిసెంబర్లోనే విడుదలవ్వాల్సిన సైంధ‌వ్ ని సలార్ కారణంగా పండగ కి షిఫ్ట్ చేసారు. అందుకు తగ్గట్టుగా ప్రమోషన్స్ చేసారు. అందరిలో సైంధ‌వ్ పై ఆసక్తిని క్రియేట్ చేసారు. కానీ విడుదలయ్యే సమయానికి సైంధ‌వ్ ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపించకపోవడం నిజంగా షాకింగ్ విషయమే.

పండగకి విడుదలైన గుంటూరు కారం, హనుమాన్, నా సామిరంగ చిత్రాల్లో సైంధ‌వ్ నలిగిపోయింది. అందరికి హనుమాన్ బీస్ట్ అయితే గుంటూరు కారం మాస్ ఎలివెంట్స్ ఉన్న మూవీగా, నా సామిరంగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ లా కనిపించడం.. ప్రేక్షకులు ఆ మూడు చూసేందుకు మొగ్గు చూపారు. కానీ సైంధ‌వ్ ని పట్టించుకోలేదు. కనీసం కంటెంట్ పరంగా పర్లేదు అన్నా ఎలా ఉందొ.. హిట్ చిత్రాల దర్శకుడు శైలేష్ కొలను సీనియర్ హీరో వెంకీతో చేసిన సైంధ‌వ్ లో ఎమోషన్స్ పండలేదు, అలాగే ఇలాంటి కథలకు కీలకమైన BGM వీక్ అవడం, యాక్షన్ శృతి మించడంతో ప్రేక్షకులు సైంధ‌వ్ ని పక్కనపెట్టేశారు.

వెంకటేష్ తన 75 వ చిత్రానికి ఇలాంటి కథ ఎన్నుకోవడం పట్ల విమర్శలు ఎక్కువయ్యాయి, ఇన్ని సక్సెస్ ఫుల్ చిత్రాలు చేసిన వెంకి ఈ చిత్రాన్ని ఎంచుకోవడం కరెక్ట్ కాదనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. పండగ కదా ఎలాంటి చితమైన ప్రేక్షకులు ఆదరిస్తారంటే పరిస్థితి ఇలానే ఉంటుంది. ఏ ఫ్యామిలీ ఎంటెర్టైనర్ప్, లేదంటే తన వయసుకు తగిన చిత్రంతో చేసుకుంటే సంక్రాంతికే కాదు.. తన కెరీర్ లో ఈ 75వ చిత్రం బెస్ట్ గా నిలిచిపోయేదని ఆయన అభిమానులే మాట్లాడుకుంటున్నారు.

Saindhav is a disappointing, annoying fare:

Venkatesh Emotional For One Fan Words At Saindhav Movie

Tags:   VENKATESH
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ