Advertisementt

యాక్షన్ ఎపిసోడ్స్ తో పుష్ప 2 షూట్ షురూ

Wed 17th Jan 2024 12:29 PM
pushpa 2  యాక్షన్ ఎపిసోడ్స్ తో పుష్ప 2 షూట్ షురూ
Pushpa 2 is shooting with action episodes యాక్షన్ ఎపిసోడ్స్ తో పుష్ప 2 షూట్ షురూ
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్ ఫ్యామిలీతో కలిసి మెగా సంక్రాంతి సెలెబ్రేషన్స్ కోసం బెంగుళూరు వెళ్ళారు. భార్య స్నేహ, పిల్లలు ఆయన్, అర్హలతో సహా బెంగుళూరు వెళ్ళిన అల్లు అర్జున్ అక్కడ మెగాస్టార్ ఫ్యామిలీతో సంక్రాంతి వేడుకలని ఘనంగా జరుపుకుని హైదరాబాద్ కి తిరిగి వచ్చేసారు. అయితే ఈరోజు నుంచి అల్లు అర్జున్ పుష్ప ద రూల్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. రెండ్రోజులు సీన్స్.. ఆ తర్వాత యాక్షన్ ఎపిసోడ్  ని సుకుమార్ చిత్రీకరించబోతున్నారు. ఈరోజు నుంచి రామోజీ ఫిలిం సిటీలో పెద్ద షెడ్యుల్ ప్లాన్ చేసి.. కంటిన్యూ గా చిత్రీకరించనున్నారు.

అయితే పుష్పలో అల్లు అర్జున్ పక్కన నటించిన జగదీశ్ ఓ కేసులో అరెస్ట్ అయ్యి జైలుపాలయ్యాడు. దానితో అతను కోసం కొద్దిరోజులు పుష్ప షూటింగ్ ఆపాల్సి వచ్చింది. తాజాగా జగదీశ్ ని బెయిల్ మీద తీసుకొచ్చారు. ప్రస్తుతం అతను షూటింగ్ లో పాల్గొంటున్నాడు.. అని తెలుస్తోంది. ఈ భారీ షెడ్యూల్ తర్వాత జాతర యాక్షన్ ఎపిసోడ్ తో పాటు కొన్ని సీన్స్ తీస్తారు.. అనే ట్వీట్ చూసిన నెటిజెన్స్ ఎన్నిరోజులు తీస్తారు భయ్యా ఈ జాతర సీక్వెన్స్, సినిమా విడుదలకు ఇంకా ఆరు నెలలు కూడా సమయంలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Pushpa 2 is shooting with action episodes:

Pushpa 2 shooting update 

Tags:   PUSHPA 2
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ