Advertisementt

అఖిల్ చేతికి గాయం

Wed 17th Jan 2024 11:49 AM
akhil  అఖిల్ చేతికి గాయం
Akhil injured presence trigger rumours అఖిల్ చేతికి గాయం
Advertisement
Ads by CJ

అక్కినేని అఖిల్ ఏజెంట్ డిసాస్టర్ తర్వాత చాలా సైలెంట్ గా ఉంటున్నాడు. ఏజెంట్ తీవ్రంగా నిరాశపరచడంతో అఖిల్ సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోయాడు. ఏజెంట్ విడుదలకు ముందు అనిల్ కుమార్ అనే కొత్త దర్శకుడిని అఖిల్ పరిచయం చెయ్యబోతున్నాడు, ఈ చిత్రానికి ధీర అనే పవర్ ఫుల్ టైటిల్ కూడా అనుకున్నారని ప్రచారం జరిగింది. కానీ అఖిల్ ఏజెంట్ తర్వాత నెక్స్ట్ మూవీ విషయం ఇంకా ఇంకా సస్పెన్స్ తోనే కనిపిస్తుంది. ఇంతలోపులో అఖిల్ సలార్ సక్సెస్ పార్టీ కోసం బెంగుళూరు వెళ్లిన పిక్ వైరల్ గా మారింది.

సలార్ టీమ్ తో  ప్రభాస్, ప్రశాంత్ నీల్ చేసుకున్న పార్టీలో అఖిల్ కనిపించడం అందరికి ఆశ్చర్యమే. కానీ ఈపార్టీలో అఖిల్ స్పెషల్ గా కనిపించడం కాదు చేతికి కట్టుతో కనిపించడమే హాట్ టాపిక్ అయ్యింది. అఖిల్ ఏజెంట్ లుక్ లోనే కనిపించినా.. చేతికి పెద్ద బ్యాండేజ్ తో కనిపించేసరికి.. ఎవ్వరికి చెప్పకుండా అఖిల్ తన తదుపరి ప్రాజెక్ట్ మొదలు పెట్టి షూటింగ్ లో పాల్గొంటున్నాడేమో.. ఆ చిత్రీకరణలోనే అఖిల్ చేతికి గాయమై ఉంటుంది లేదంటే ఇంత పెద్ద కట్టుతో అఖిల్ ఎందుకు కనిపిస్తాడని అభిమానులు ఊహించుకుంటున్నారు.

మరి అఖిల్ చేతికి ఆ దెబ్బ ఎలా తగిలిందో, ఎందుకు తగిలిందో కాని.. ఇప్పుడు అఖిల్ చేతికి ఆ పెద్ద కట్టు విషయంలో చాలా చర్చలు మొదలయ్యాయి. 

Akhil injured presence trigger rumours:

Akhil spotted at Salaar success part

Tags:   AKHIL
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ