Advertisementt

ఇదే లుక్ మైంటైన్ చెయ్ ప్రభాస్

Wed 17th Jan 2024 11:20 AM
prabhas fans  ఇదే లుక్ మైంటైన్ చెయ్ ప్రభాస్
Prabhas new look goes viral ఇదే లుక్ మైంటైన్ చెయ్ ప్రభాస్
Advertisement
Ads by CJ

ప్రభాస్ కొన్నాళ్లుగా లుక్స్ విషయంలో అభిమానులని బాగా డిస్పాయింట్ చేస్తున్నారు. బాహుబలితో రాజుగా అందరి కళ్ళకి అద్భుతంగా కనిపించిన ప్రభాస్ మళ్ళీ నిన్నమొన్నటి సలార్ వరకు లుక్స్ విషయంలో విమర్శల పాలయ్యారు. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ ఇలా ప్రతి సినిమాలో కాస్త బరువుగా కనిపించడమే కాకుండా.. హెయిర్ స్టయిల్, ఫేస్ విషయంలో చాలా తేడాగా కనిపించారు. సినిమా ఫలితాలు ఒక ఎత్తు, ఆయన లుక్స్ విషయం ఒక ఎత్తు అన్నట్టుగా తయారైంది. అయితే ఈమధ్యన సలార్ రిలీజ్ అయ్యాక ప్రభాస్ సలార్ సక్సెస్ పార్టీల్లో కనిపించారు.

ఇంతకుముందు సలార్ సక్సెస్ సెలెబ్రేషన్న్ లో పృథ్వీ రాజ్ తో పాల్గొన్న ప్రభాస్.. తాజాగా సలార్ 25 డేస్ సక్సెస్ పార్టీలో టీమ్ తో కలిసి పాల్గొన్నారు. నిన్న సోషల్ మీడియాలో ప్రభాస్ కనిపించిన తీరుకి ఆయన అభిమానులు ముగ్దులయ్యారు. ప్రభాస్ లుక్ చూసి సర్ ప్రైజ్ అయ్యారు. దానితో ఇదే లుక్ ని మైంటైన్ చెయ్ ప్రభాస్ అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. హెయిర్ స్టయిల్, ఫేస్ అన్నీ చూడడానికి అదిరిపోయాయి, ఇప్పుడు మాట్లాడండిరా ప్రభాస్ లుక్స్ గురించి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నిజమే ప్రభాస్ ఈ సలార్ పార్టీలో చాలా హ్యాండ్ సమ్ గా కనిపించారు.

ఇక ప్రభాస్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కల్కి మే 9 న విడుదల కాబోతుండగా.. మారుతి తో చేస్తున్న రాజా సాబ్ ఈ పొంగల్ కి ఫస్ట్ లుక్ తో అభిమానులకి డబుల్ ట్రీట్ ఇచ్చారు ప్రభాస్.  

Prabhas new look goes viral:

Prabhas fans surprise Prabhas new look

Tags:   PRABHAS FANS
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ