గత రెండేళ్లుగా సమంత లుక్స్ విషయంలో విమర్శలు ఎదుర్కొంటుంది. మాయోసైటిస్ వచ్చాక ఆమె ఫిట్ నెస్ అంటూ వర్కౌట్స్ చెయ్యడంతో మొహంలో గ్లో పోయింది. జిమ్ చేస్తూ ఫిట్ నెస్ ని మైంటైన్ చేసినా మొహం కళ కళ లాడితేనే బావుంటుంది. ఒకప్పుడు కళగా వెలిగిపోయిన సమంత ఇప్పుడు ఆ మొహం లో కళ పోగొట్టుకుంది అనే కామెంట్స్ వింటుంది. ఖుషి చిత్రంలో విజయ్ దేవరకొండ పక్కన సమంత తేలిపోయింది. లుక్స్ విషయంలో సమంతని ప్రతి ఒక్కరూ విమర్శించారు.
అయితే ఇప్పుడు సమంత ఆ విమర్శలకు సమాధానం చెప్పబోతుందా? అంటే అవుననే అనిపిస్తుంది. సమంత కొత్తగా ఫ్రెష్ గా షేర్ చేసిన క్లోజప్ లుక్ చూస్తే ఆమె మోహంలో గ్లో కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. న్యూ ఇయర్ ని కొత్తగా ప్రారంభిస్తున్నట్టుగా సమంత లుక్ ఉంది. మరి గత ఏడాది శాకుంతల, ఖుషి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత ఈ ఏడాది సిటాడెల్ సీరీస్ తో రాబోతుంది. అలాగే సమంత చెయ్యబోయే కొత్త ప్రాజెక్ట్స్ పై అందరిలో విపరీతమైన క్యూరియాసిటీ ఉంది. ఎందుకంటే ఆమె నెక్స్ట్ చెయ్యబోయే జోనర్ ఎలా ఉండబోతుందో అని. మరి సమంత ఎలాంటి మూవీ ని మొదలు పెడుతుందో చూడాలి.