ఏజెంట్ ప్లాప్ తర్వాత అఖిల్ అక్కినేని కొత్త ప్రాజెక్ట్ ఎనౌన్స్ చేయకపోవడమే కాదు, అసలు మీడియాకి కూడా కనిపించడం లేదు. గత ఏప్రిల్ తర్వాత మధ్యలో అన్నపూర్ణ స్టూడియోస్ లో నాగేశ్వరావు గారి విగ్రహావిష్కరణ రోజు, ఆ తరవాత మరోసారి కనిపించిన అఖిల్ తాజాగా సలార్ సక్సెస్ పార్టీలో కనిపించి అక్కినేని ఫాన్స్ ని సర్ ప్రైజ్ చేసాడు. సలార్ విడుదలై సక్సెస్ ఫుల్ గా 25 డేస్ పూర్తి చేసుకోవడం, భారీ కలెక్షన్స్ సాధించడంతో ప్రశాంత్ నీల్, ప్రభాస్ ఇంకా నిర్మాతలు, శృతి హాసన్ అందరూ కలిసి పార్టీ చేసుకున్నారు.
అయితే ఈ పార్టీకి అక్కినేని ప్రిన్స్ అఖిల్ హాజరవడమే ఇప్పుడు హాట్ టాపిక్. ఆ పార్టీలో అఖిల్ ఏజెంట్ మూవీ లోనే ఇంకా కొనసాగడమే కాదు, అదే బాడీని కంటిన్యూ చేస్తున్నాడు. ఇక అఖిల్ ప్రభాస్ సలార్ పార్టీలో కనిపించడంతో ఆయన అభిమానులు సరదాగా ఇలా కామెంట్స్ చేస్తున్నారు. Asalu ayyagaru em chestnaru kompatesi part 2 lo emana...... #SalaarAde prapanchaniki teliyakunda rajamannar Thana moodo kodukuni dooramga penchuthu vacchadu #Salaar2 అంటూ కామెంట్ చేయడమే కాదు.. అఖిల్ నెక్స్ట్ మూవీ ఎప్పుడు అంటూ అడుగుతున్నారు. మరి అఖిల్ తన కొత్త ప్రాజెక్ట్ పై కొత్త కబురు ఎప్పుడు వినిపిస్తాడో చూడాలి.