మెగా ఫ్యామిలిలో పెద్దలు, పిల్లలు అందరూ సంక్రాంతి సెలెబ్రేషన్స్ కోసం బెంగుళూరు ఫామ్ హౌస్ కి తరలి వెళ్లారు. అక్కడ ఫామ్ హౌస్ లో భోగి మంటలు, మార్నింగ్ టిఫిన్స్ అంటూ తెగ హడావిడి చేసారు. ఈ సెలెబ్రేషన్స్ కోసం మెగా ఫ్యామిలీ మెంబెర్స్, అల్లు ఫ్యామిలీ మెంబెర్స్ చిన్న, పెద్దా అందరూ బెంగుళూరికి వెళ్లారు. చరణ్ కుమర్తెతో క్లింకారతో సహా వెళ్ళారు. అల్లు అర్జున్ తన పిల్లలతో సహా వెళ్ళారు, వరుణ్ తేజ్ భార్య లావణ్యని తీసుకుని వెళ్లారు. ఇలా ఎవరికి వారే స్పషల్ గా బెంగుళూరుకి చేరుకోగా.. మెగాస్టార్ మాత్రం సతీమణి సురేఖతో కలిసి వారం ముందుగానే బెంగుళూరికి వెళ్లి అక్కడ ఏర్పాట్లు చూసుకున్నారు.
ఇక నిన్న సంక్రాంతి రోజున అందరూ సరదాగా గడిపిన క్షణాలను ఫోటోల రూపంలో వదిలారు. మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ కలిసి దిగిన గ్రూప్ పిన్ ని వదలగానే అది సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. అయితే ఈరోజు కనుమ రోజు కూడా బెంగుళూరులోనే మెగా ఫ్యామిలీ ఉంటుంది అనుకున్నారు. కానీ మెగాస్టార్ చిరు ఆయన భార్య సురేఖ, కొడుకు చరణ్ మరియు ఉపాసన, పాప క్లింకార అందరూ తిరిగి హైదరాబాద్ కి చేరుకున్న ఎయిర్ పోర్ట్ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కడుతున్నాయి. దానితో సంక్రాంతి సెలెబ్రేషన్ ముగించేసిన మెగా ఫ్యామిలీ అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.