Advertisementt

బీడీ తాగితే తలనొప్పి వచ్చింది: మహెష్

Tue 16th Jan 2024 04:44 PM
guntur kaaram  బీడీ తాగితే తలనొప్పి వచ్చింది: మహెష్
What Mahesh Smoked In GK Were Not Tobacco Beedis బీడీ తాగితే తలనొప్పి వచ్చింది: మహెష్
Advertisement
Ads by CJ

మహేష్ బాబు నటించిన గుంటూరు కారం గత శుక్రవారం విడుదలైంది. మిక్స్డ్ టాక్ తోనే మంచి కలెక్షన్స్ కొల్లగొడుతున్న గుంటూరు కారంపై సోషల్ మీడియాలో నెగెటివ్ టాక్ బాగా స్ప్రెడ్ అయ్యింది. అయితే గుంటూరు కారం విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్స్ పట్టించుకొని మహేష్ బాబు ఇప్ప్పుడు సర్ ప్రైజింగ్ గా ఓ ఇంటర్వ్యూ ఇవ్వడం చర్చినీయాంశం అయ్యింది. సినిమా విడుదలకు ముందు ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్ తో సరిపెట్టేసిన మహేష్ బాబు గుంటురు కారం ముచ్చట్లు మాట్లాడడానికి ఇంటర్వ్యూ ఇచ్చారు. అది కూడా పండుగ రోజు.

సుమ మహేష్-హీరోయిన్ శ్రీలీలని ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో గుంటురు కారం సక్సెస్ అవడం సంతోషంగా ఉంది, సూపర్ హిట్ కలెక్షన్స్ రావడం హ్యాపీ అన్నమహేష్ బాబు తాను ఈ చిత్రంలో బీడీ తాగిన విషయం గురించి మట్లాడారు. కొన్నేళ్లుగా ఈ బీడీ, సిగరెట్స్ కి దూరంగా ఉంటున్న మహేష్ ని ఇప్పుడు ఈచిత్రంలో స్పెషల్ గా బీడీ తాగడం గురించి అడిగింది యాంకర్. దానికి మహేష్ నేను స్మోకింగ్ ని ఎంకరేజ్ చెయ్యను, నేను తాగింది ఆయుర్వేదిక్ బీడీ అంటూ చెప్పి షాకిచ్చారు. ఈ చిత్రం కోసం మొదటి సారి రియల్ బీడీ తాగినప్పుడు మైగ్రేన్ ఇబ్బంది పెట్టి తలనొప్పి వచ్చేసింది, ఇదే విషయం త్రివిక్రమ్ గారితో చెప్పాను. అప్పుడు ఆయన చాలా అలోచించి ఈ ఆయుర్వేదిక్ బీడీ తాగమన్నారు, అందులో లవంగం లాంటివి ఉన్నాయి.. అంటూ మహేష్ చెప్పడంతో సుమ షాకైపోయింది. అరేయ్ వినండిరా అది ఆయుర్వేదిక్ బీడీ అంటూ చెప్పింది.

మరి మహేష్ గుంటూరు కారంలో చాలాసార్లు బీడీ తాగుతూనే కనిపించారు. ఆ సీన్స్ అన్నీ చాలా బాగా వచ్చాయనే ప్రశంశలు అభిమానుల నుంచి అందుకున్నారు. విడుదలకు ముందే మహేష్ బీడీ పోస్టర్స్ పదే పదే ఫాన్స్ సర్ ప్రైజ్ చేసాయి. 

What Mahesh Smoked In GK Were Not Tobacco Beedis:

Guntur Kaaram Interview

Tags:   GUNTUR KAARAM
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ