నిన్న మెగా ఫ్యామిలీ సంక్రాంతి వేడుకల్లో పవన్ కళ్యాణ్ వారసుడు అకీరా లుక్ బయటికి వచ్చింది. నూనూగు మీసాలతో అకీరా స్టైలిష్ లుక్ తో అచ్చం హీరో మెటీరియల్ గా కనిపించేసరికి పవన్ కళ్యాణ్ ఫాన్స్ అకీరా లేటెస్ట్ లుక్ ని సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేసారు. అకీరా హీరోగా ఎంట్రీ ఇవ్వాలని డిమాండ్స్ మళ్ళీ మొదలు పెట్టారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా వున్నారు.. ఈ సమయంలో తమ కోసం అకీరా రావాలనేది వారి కోరిక. ఇక అకీరా సంక్రాంతి లుక్ చూసాక వాళ్ళకి వింటేజ్ పవన్ కళ్యాణ్ గుర్తొస్తున్నారు.
పవన్ కళ్యాణ్ అకీరా వయసులో ఉండగా.. ఎలా ఉండేవారో అప్పటి ఫోటోని ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. అప్పట్లో పవన్ ఎలా నూనూగు మీసాలతో స్టయిల్ గా కనిపించారో అచ్చం అలానే అకీరా ని చూడగానే పవన్ కళ్యాణ్ ఫాన్స్ చాలా ఎగ్జైట్ అవుతూ పవన్-అకీరా ఫొటోస్ ని పక్క పక్కనే పెట్టి వైరల్ చేస్తున్నారు. అచ్చం పవన్ లా ఉన్న అకీరాని చూసి పవన్ కళ్యాణ్ ఫాన్స్ పండగ సంబరాల్లో మునిగిపోయారు.