గుంటూరు కారం జనవరి 12 న విడుదలై మిక్స్డ్ రెస్సాన్స్ తెచ్చుకుంది. మహేష్ ఫాన్స్ కి గుంటూరు కారం బాగా నచ్చింది. మహేష్ యాక్టింగ్ సూపర్, రమణగాడి పాత్రలో మహేష్ ఫుల్ ఎనెర్జీతో రెచ్చిపోయాడు, మహేష్ లుక్స్ వైజ్ గా అదరగొట్టేసాడంటూ గుంటూరు కారం చూసిన ప్రేక్షకులు చెబుతున్నా.. సోషల్ మీడియాలో మాత్రం గుంటూరు కారం విషయంలో నెగిటివిటి కనబడుతుంది. నిర్మాతలు గుంటూరు కారం బావుంది అంటూ ప్రెస్ మీట్స్ పెడుతున్నారు.
ఇక మహేష్ బాబు గుంటూరు కారం సక్సెస్ జోష్ లో తన ఇంట్లోనే గుంటూరు కారం టీమ్ కి స్పెషల్ గా పార్టీ ఇచ్చారు. సంక్రాంతి సందర్భంగా మహేష్ ఇంట్లో ఈరోజు సాయంత్రం ఇచ్చిన గుంటురు కారం సక్సెస్ పార్టీకి హీరోయిన్స్ శ్రీలీల, మీనాక్షి చౌదరి, దిల్ రాజు, శిరీష్, దిల్ రాజు వైఫ్, నిర్మాత నాగ వంశీ హాజరైన పిక్స్ ని మహేష్ సోషల్ మీడియాలో షేర్ చేసారు. అందులో నమ్రత కూడా స్పెషల్ గా కనిపించారు.