హీరోయిన్స్ అయినా, హీరోస్ అయినా.. పెద్ద పండుగ సంక్రాంతి కి తమ సినిమాలని బాక్సాఫీసు బరిలో నిలుపుతూ అభిమానులకి స్పెషల్ ట్రీట్స్ ఇవ్వడమే కాదు తమ ఫామిలీస్ తో కలిసి సంక్రాంతి పండుగని అంగరంగ వైభవంగా చేసుకుంటారు,. తామెలా పండుగని సెలెబ్రేట్ చేసుకున్నామో అనేది పిక్స్ ద్వారా అభిమానులకి చేరవేస్తారు. అలాగే ఇప్పుడు కన్నడ క్యూటీ రష్మిక సంక్రాంతి ఫెస్టివ్ లుక్ ని వదులుతూ అభిమానులకి పండగ శుభాకాంక్షలు తెలిపింది.
చక్కటి మోడరన్ డ్రెస్సులో పండుగ కళ ఉట్టిపడేలా రెడీ అయిన రష్మిక ట్రెడిషనల్ లుక్ పండుగ శోభని తెలియజేసేదిలా ఉంది. ఎప్పుడూ గ్లామర్ కి ప్రాధాన్యం ఇస్తూ సోషల్ మీడియాలోను, సినిమాల్లోని కనిపించే రష్మిక మందన్న ఈ సంక్రాంతి పండుగని మాత్రం చక్కటి డ్రెస్సు తో అలంకరించుకుని కనిపించింది. ఈమధ్యనే యానిమల్ తో సూపర్ సక్సెస్ అందుకున్న రష్మిక ప్రస్తుతం పుష్ప ద రూల్ తో పాటుగా మరికొన్ని ప్రాజెక్టుల్లో నటిస్తుంది.