పవన్ కళ్యాణ్ వారసుడు అకీరా నందన్ హీరో గా ఎపుడెప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని పవన్ ఫాన్స్ ఎదురు చూడని రోజు లేదు. ఇండస్ట్రీలో అకీరా నందన్ హీరోగా కెరీర్ స్టార్ట్ చేసే రోజు కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఆ మధ్యన రేణు దేశాయ్ అకీరాకి నటుడిగా అవ్వాలనుంటే అవుతాడు.. దానికి నేను అడ్డు చెప్పను, కానీ అకీరాకి మ్యూజిక్ అంటే ఇష్టమని చెప్పారు. పవన్ ఫాన్స్ మాత్రం అకీరా ఎప్పుడు ఎక్కడ కనిపించినా వారసుడి ఎంట్రీ పై ఎగ్జైట్ అవుతూనే ఉంటారు.
ఇప్పటివరకు కుర్రాడిగా స్కూల్ పిల్లాడిలా కనిపించిన అకీరా మొదటిసారి సూపర్ కూల్ పర్ఫెక్ట్ హీరో మెటీరియల్ లుక్ లో కనిపించేసరికి పవన్ ఫాన్స్ కి పూనకలొచ్చేస్తున్నాయి. మెగా ఫ్యామిలీ సంక్రాంతి సెలెబ్రేషన్స్ లో భాగంగా పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ కూడా బెంగుళూరుకి వెళ్ళాడు. చెల్లి ఆద్య తో కలిసి మెగా సంక్రాంతి సెలెబ్రేషన్స్ లో మెగా ఫ్యామిలిలో ప్రత్యేకంగా నిలిచాడు. అక్కడ చెల్లి ఆద్యతో కలిసి అకీరా దిగిన పిక్ బయటికి రాగానే పవన్ కళ్యాణ్ వారసుడొచ్చాడంటూ పవన్ ఫాన్స్ పొంగల్ సెలెబ్రేషన్స్ ని రెచ్చిపోయి చేసుకుంటున్నారు.
సాంప్రదాయంగా అకీరా లాల్చీ పైజామాలో అచ్చం హీరోలా కనిపించాడు. అది చూసిన పవన్ ఫాన్స్ అన్నయ్య @PawanKalyan గారి బిడ్డలకు ఎవరి దిష్టి తగలకుండా ఉండాలి.. అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.